ఎట్టకేలకు కదిలిన పోలీసులు… కోడెలపై కేసు నమోదు

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై దొంగతనం కేసు నమోదైంది. పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ఎట్టకేలకు కేసు బుక్ చేశారు. అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్ దొంగలించిన కేసులో తుళ్లూరు పోలీసులు కోడెలపై కేసు నమోదు చేశారు. అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్‌ ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 404, ఐపీసీ 414 కింద కేసులు పెట్టారు.

నాదెండ్ల మనోహర్‌ స్పీకర్‌గా ఉన్న సమయంలో విదేశాల నుంచి అత్యంత ఖరీదైన పర్నీచర్‌ను అసెంబ్లీ కోసం కొనుగోలు చేశారు. అందులో కోటికి పైగా విలువైన ఫర్నీచర్‌ను కోడెల తన ఇంటికి దొంగలా మళ్లించారు. వాటినే తన కుమారుడి షోరూంలో కూడా వాడుకుంటూ దర్జాగా ఇంతకాలం ఎంజాయ్ చేశారు. ఫర్నీచర్ దొంగతనం వ్యవహారంలో సాక్ష్యాలు చాలా బలంగా ఉండడంతో కోడెలపై పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదు.

కోడెల విషయంలో కొందరు పోలీసు అధికారులు ఇప్పటికీ మెతకవైఖరిలో ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి. కోడెల తప్పించుకునేందుకు అన్నివిధాలుగా సహకరించే ప్రయత్నం చేశారని.. కానీ అది సాధ్యం కాకపోవడం, విమర్శలు ఎక్కువవడంతో కేసు నమోదు చేశారు. ప్రభుత్వం మారినా పోలీసులు కొందరు ఇంకా టీడీపీ మత్తులోనే ఉన్నారన్న దానికి కోడెల కేసులో వ్యవహరిస్తున్న తీరు కూడా ఉదాహరణగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి