కోడెలపై చంద్రబాబు హాట్ కామెంట్స్… ఇక క్లియర్

కోడెలపై చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఇక కోడెలను ఎవరూ కాపాడలేరని దీన్ని బట్టి అందరికీ అర్థమైంది. టీడీపీ హయాంలో స్పీకర్ గా కోడెల చేసిన అక్రమాలపై బాధితులు పోలీస్ స్టేషన్ గడపతొక్కడం.. తాజాగా ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్ నుంచి కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు…. ఇలా ప్రభుత్వ సొమ్మును దొంగిలించిన కోడెల….  ఫ్యామిలీ మెంబర్స్ అప్పనంగా వాడేయడం వెలుగుచూసింది. దీంతో అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో… గుండెపోటు వచ్చిందంటూ కోడెలను వాళ్లకు చెందిన ఆస్పత్రిలోనే చేర్చారు కుటుంబ సభ్యులు.

ఈ వ్యవహారం పై చంద్రబాబు తాజాగా స్పందించారు. కోడెల అక్రమాలకు పాల్పడితే శిక్షించవచ్చని.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. నిన్న మొన్నటి వరకు కోడెల వ్యవహారశైలిపై అధికార వైసీపీ దుమ్మెత్తిపోయగా.. ఇప్పుడు ఆయన అక్రమాల వ్యవహారం చూసి టీడీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే… కోడెల విషయంలో చంద్రబాబు స్టాండ్ మార్చుకున్నట్టు అర్థమవుతోంది..

కోడెలను వెనకేసుకు వస్తే అది టీడీపీకే ప్రమాదమని.. తప్పు ఉంటే శిక్షించండని చంద్రబాబు అనడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు పరోక్షంగా కోడెల తప్పును ఒప్పుకున్నట్టేనని… రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పటివరకు కోడెల వెన్నంటి టీడీపీ ఉంటుందని చంద్రబాబు మాట్లాడుతూ వచ్చారు. కానీ అక్రమాల పుట్ట పెద్దదిగా ఉండడంతోనే చంద్రబాబు ఈ విషయంలో కోడెలకు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అన్నట్టుగా ఉన్నట్టు తెలుస్తోంది.