శాండిల్ వుడ్ కి…. తెలుగమ్మాయి

ప్రస్తుతం ఇండస్ట్రీలో డింపుల్ హయతి పేరు బాగానే వినిపిస్తోంది. ఈ మధ్యనే వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘వాల్మీకి’ సినిమాలో ఈమె ఐటమ్ సాంగ్ లో కనిపించిన సంగతి తెలిసిందే.

‘జర్రా జర్రా’ అంటూ సాగే పాట వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యనే ప్రభుదేవా తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ‘అభినేత్రి 2’ సినిమా లో చిన్న పాత్ర పోషించిన డింపుల్ హయతి ఈ సినిమా ద్వారా కొంచెం పాపులారిటీని సంపాదించింది. కానీ తాజాగా ‘వాల్మీకి’ సినిమాతో మాత్రం ఈమె కు బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించిపెట్టింది.

తాజా సమాచారం ప్రకారం తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగు అమ్మాయి ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతోందట. ప్రముఖ దర్శకుడు చంద్రమౌళి దర్శకత్వం వహిస్తున్న ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమాలో హీరోయిన్ పాత్ర పోషించే అవకాశం డింపుల్ కి దక్కినట్లు తెలుస్తోంది.

‘అభినేత్రి 2’ సినిమాలో ఆమె నటన చూసి ఇంప్రెస్ అయిన ఈ దర్శకుడు ఆమెని  సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఈమె కన్నడ నేర్చుకుంటోందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అలా ఈ తెలుగమ్మాయి ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో సైతం తన ప్రతిభను చాటనుందన్నమాట.