చెన్నై లో…. సాహో నాలుగో పాట

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఈ నెల 30 న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో కూడా విడుదల కాబోతోంది.

తమిళం లో కూడా ఈ సినిమా విడుదల అవుతుండడంతో…. అక్కడ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ని కూడా ఎలాగైనా వాడుకోవాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ చాలా భారీగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే చిత్ర యూనిట్ ప్రత్యేకంగా చెన్నై లో ఉన్న అభిమానులకి ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఇదే విషయాన్ని చెప్తూ…. అక్కడ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు కూడా. 

అయితే ఇంతకీ ఆ స్పెషల్ ఏంటి అంటే, సినిమాలోని నాలుగో పాట. ఈ సినిమాలో నాలుగో పాట ని ప్రత్యేకం గా చెన్నై లో ప్రదర్శించారు. ఇప్పటి వరకు ఎక్కడా విడుదల కానీ ఈ పాట ని ప్రత్యేకంగా చెన్నై లో విడుదల చేసి ఒక 40 శాతం అందరికీ చూపించారు. మిగిలిన పాట విడుదల రోజే చూడాలి.