చరణ్ కూల్…. చిరంజీవి టెన్షన్….

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలు ‘సాహో’, ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రాల నిర్మాతలు పైకి ఎంత కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నప్పటికీ…. లోలోపల మాత్రం ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ప్రాఫిట్ వస్తుందా లేదా అనే భయం వారిని ప్రతి నిమిషం వెంటాడుతూనే ఉంటుంది.

ఇప్పటిదాకా 20 లేదా 30 కోట్ల బడ్జెట్ సినిమాలలో నటించిన చిరంజీవి…. సైరా కోసం ఇప్పుడు దాదాపు 300 కోట్లు పెట్టారట.

అయినప్పటికీ ప్రస్తుతం చిరంజీవికి ఉన్న మార్కెట్ చూస్తే సైరా సినిమా ఈజీగా ఈ బడ్జెట్ ను మించే కలెక్షన్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

సినిమాకి ఒక వేళ యావరేజ్ టాక్ వచ్చినా…. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 80 కోట్లు పైగానే కలెక్షన్స్ రాబడుతుందని….  హిందీలో ఈజీగా 100 కోట్లు వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడట రామ్ చరణ్.

ఇవే కాకుండా డిజిటల్ రైట్స్ అని శాటిలైట్ రైట్స్ అంటూ ఎంతోకొంత రామ్ చరణ్ కి వస్తూనే ఉంటుంది. ఎన్ని రకాలుగా చూసినా ఈ సినిమా రామ్ చరణ్ కి ప్రాఫిట్ తెచ్చే ప్రాజెక్టే అంటున్నారు.

అయితే ఎన్ని పాజిటివ్ యాంగిల్స్ ఉన్నప్పటికీ…. అంత బడ్జెట్ పెట్టిన నిర్మాతకి ఆ మాత్రం భయం ఉండటం సహజమే.

కానీ ‘సైరా’ విషయంలో రామ్ చరణ్ కాన్ఫిడెంట్ గానే ఉన్నప్పటికీ చిరంజీవికి మాత్రం సినిమా బడ్జెట్ విషయంలో కొంచెం టెన్షన్ గానే ఉందని సమాచారం.