Telugu Global
Cinema & Entertainment

'భక్త కన్నప్ప' గా యంగ్ రెబెల్ స్టార్?

ఎప్పుడూ ఒకే రకం సినిమాలు కాకుండా సరికొత్త జోనర్లో సినిమాలు తీయడంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందుంటాడు. డార్లింగ్ లాంటి రొమాంటిక్ కామెడీ సినిమా, చత్రపతి వంటి గ్యాంగ్ స్టర్ సినిమా, మిర్చి లాంటి కమర్షియల్ సినిమా, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి ఫ్యామిలీ సినిమాతో దాదాపు అన్ని రకాల జోనర్లు కవర్ చేసిన ప్రభాస్ ‘బాహుబలి’ వంటి వార్ డ్రామా సినిమా లో కూడా నటించాడు. ఇక ‘సాహో’ తో మొట్టమొదటిసారిగా ఒక యాక్షన్ థ్రిల్లర్ […]

భక్త కన్నప్ప గా యంగ్ రెబెల్ స్టార్?
X

ఎప్పుడూ ఒకే రకం సినిమాలు కాకుండా సరికొత్త జోనర్లో సినిమాలు తీయడంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందుంటాడు. డార్లింగ్ లాంటి రొమాంటిక్ కామెడీ సినిమా, చత్రపతి వంటి గ్యాంగ్ స్టర్ సినిమా, మిర్చి లాంటి కమర్షియల్ సినిమా, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి ఫ్యామిలీ సినిమాతో దాదాపు అన్ని రకాల జోనర్లు కవర్ చేసిన ప్రభాస్ ‘బాహుబలి’ వంటి వార్ డ్రామా సినిమా లో కూడా నటించాడు.

ఇక ‘సాహో’ తో మొట్టమొదటిసారిగా ఒక యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా తరువాత కూడా ‘జాన్’ అనే ఒక ఫాంటసీ రొమాంటిక్ సినిమా లో కనిపించనున్నాడు ప్రభాస్. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ డివోషనల్ సినిమాలో నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

కృష్ణంరాజు నటించిన ‘భక్త కన్నప్ప’ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో కృష్ణంరాజు నటన అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అదే కుటుంబం నుంచి వచ్చిన ప్రభాస్ సినిమా మళ్లీ అదే సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్వయంగా కృష్ణం రాజు ఈ సినిమా కి దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

అయితే ఇప్పటిదాకా ప్రభాస్ డివోషనల్ సినిమాలో నటించిన దాఖలాలు లేవు. మరి భక్త కన్నప్ప కథని ప్రభాస్ ఎంచుకుంటాడా లేక మరొక డివోషనల్ సినిమా వైపు మొగ్గు చూపుతాడా అనేది తెలియాల్సి ఉంది.

First Published:  26 Aug 2019 12:21 AM GMT
Next Story