Telugu Global
NEWS

నేడు ఢిల్లీకి సీఎం జగన్... హోంమంత్రి అమిత్ షా తో ప్రత్యేక సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు ఢిల్లీ వెళ్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు వామపక్ష తీవ్రవాదం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ సోమవారం కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. కేంద్ర హోం మంత్రితో జరిగే ఈ […]

నేడు ఢిల్లీకి సీఎం జగన్... హోంమంత్రి అమిత్ షా తో ప్రత్యేక సమావేశం
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు ఢిల్లీ వెళ్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు వామపక్ష తీవ్రవాదం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ సోమవారం కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. కేంద్ర హోం మంత్రితో జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశంపై ముఖ్యంగా చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఇటీవల రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలు, వాటి కారణంగా వచ్చిన నష్టంపై కూడా ముఖ్యమంత్రి జగన్మోమోహన్ రెడ్డి చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

పోలవరం టెండర్లు రద్దు, అనంతరం దానిపై హైకోర్టు జోక్యం చేసుకోవడం వంటి అంశాలపై హోంమంత్రి అమిత్ షాతో సీఎం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అలాగే తమ ప్రభుత్వం చేపట్టదలచిన విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాలపై సమీక్షలు జరిపే అంశంపై కూడా వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు, వాటి కార్యదర్శుల ఎంపిక, నూతనంగా తీసుకువచ్చిన ఇసుక పాలసీ తో పాటు మరిన్ని అంశాలపై కేంద్ర హోం మంత్రితో చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.

రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయడంపై తాము తీసుకుంటున్న నిర్ణయాలు, నూతన ఎక్సైజ్ విధానంపై కూడా వీరిరువురి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిలపై కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.

First Published:  25 Aug 2019 9:04 PM GMT
Next Story