జైట్లీ అంత్యక్రియల్లో చేతివాటం…. కేంద్రమంత్రులకు షాక్

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మరణించారు. ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు. దీంతో ఆయనకు బదులుగా ఈ అంత్యక్రియలను గ్రాండ్ గా నిర్వహించేందుకు కేంద్రమంత్రులంతా రెడీ అయ్యారు.

జైట్లీ సీనియర్ నేత కావడం.. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండడంతో దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు తరలివచ్చారు. దీంతో ఈ అంతిమయాత్ర కిక్కిరిసింది.

అయితే ఈ గుంపులోనే దొంగలు విరుచుకుపడ్డారు. చేతివాటం ప్రదర్శించారు. జైట్లీ అంతక్రియల సమయంలో ఏకంగా కేంద్ర మంత్రులు సోమ్ ప్రకాష్, బాబు సుప్రియో తోపాటు సుప్రీయో సెక్రెటరీ, మరో ఇద్దరు అధికారుల ఫోన్లు చోరీకి గురయ్యాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.

కేంద్రమంత్రుల ఫోన్లే కొట్టేసిన వైనం కలకలం రేపుతోంది. ఈ ఫోన్లపై వచ్చిన ఫిర్యాదులపై వేగంగా స్పందించిన పోలీసులు ఆ ఫోన్లను ట్రేస్ చేస్తున్నారు. అయితే అంత్యక్రియల ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ ఫోన్ చోరీలు ఎవరు చేశారనేది తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది.