Telugu Global
NEWS

ఉమకు ఉత్తమ పుకార్ల సృష్టికర్త బిరుదు ఇచ్చేసిన టీడీపీ నేతలు

టీడీపీ నేతలు చాలా మంది ప్రెస్‌మీట్లు పెట్టినా … వారిలో దేవినేని ఉమా ప్రెస్‌మీట్లు మాత్రం కాస్త మసాలాతో ఉంటాయి. కారణం ఆయన ఏదో కథ అల్లుకునే… మీడియా సమావేశానికి వస్తారని… అందుకే ఆయన ప్రెస్‌మీట్లు హైలెట్‌ అవుతుంటాయన్నది తోటి టీడీపీ నేతల అభిప్రాయం. నిజాలపై ఉమాకు పెద్దగా పట్టింపు ఉండదని… వైరిపక్షంపై బురద జల్లడం ఎలా అన్నదే ఆయన దృష్టిలో ఉంటుందని… అందుకే అవలీలగా కొత్త విషయాలను చెప్పేస్తుంటారని వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటి ప్రకటన ఇటీవల దేవినేని […]

ఉమకు ఉత్తమ పుకార్ల సృష్టికర్త బిరుదు ఇచ్చేసిన టీడీపీ నేతలు
X

టీడీపీ నేతలు చాలా మంది ప్రెస్‌మీట్లు పెట్టినా … వారిలో దేవినేని ఉమా ప్రెస్‌మీట్లు మాత్రం కాస్త మసాలాతో ఉంటాయి. కారణం ఆయన ఏదో కథ అల్లుకునే… మీడియా సమావేశానికి వస్తారని… అందుకే ఆయన ప్రెస్‌మీట్లు హైలెట్‌ అవుతుంటాయన్నది తోటి టీడీపీ నేతల అభిప్రాయం.

నిజాలపై ఉమాకు పెద్దగా పట్టింపు ఉండదని… వైరిపక్షంపై బురద జల్లడం ఎలా అన్నదే ఆయన దృష్టిలో ఉంటుందని… అందుకే అవలీలగా కొత్త విషయాలను చెప్పేస్తుంటారని వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటి ప్రకటన ఇటీవల దేవినేని ఉమా ఒకటి చేశారు.

జగన్‌ అమెరికాకు వెళ్తూ వెళ్తూ… కడప జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యేను పిలిచి అమరావతిని తరలిస్తున్నాం… దొనకొండ వద్ద భూములు కొనేసేయ్ అని చెప్పారని దేవినేని ఉమా ఒక కథ చెప్పేశారు.

దేవినేని ఉమా చెప్పింది నిజమేనేమో అని పలువురు టీడీపీ నేతలు, వైసీపీ నేతలు ఆరా తీయడం మొదలుపెట్టేశారు. వైసీపీ కడప జిల్లా మాజీ ఎమ్మెల్యేలంతా ఒకరికొకరు ఆరా తీసుకుని అలాంటిదేమీ లేదని నిర్ధారణకు వచ్చారు.

ఇక టీడీపీ నేతలు కూడా ఆ ప్రయత్నం చేశారు. కొందరు ఉండబట్టలేక దేవినేని ఉమా వద్దే ఆ కడప జిల్లా మాజీ ఎమ్మెల్యే ఎవరూ అని ఆరా తీశారట. దాంతో ఉమా నవ్వేసి వెళ్లిపోయారని చెబుతున్నారు.

ఈ అంశమే మరికొందరు టీడీపీ సీనియర్ల వద్ద ప్రస్తావనకు రాగా… అదంతా స్క్రిప్ట్‌లో భాగమేనని సీనియర్లు వివరించారు. అయినా దేవినేని ఉమా ప్రెస్‌మీట్ లో చెప్పిన అంశంపై ఆరా తీయడం ఏటంయ్యా బాబు… మరీ అమాయకుడిగా ఉన్నావే అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారట.

అంతలో మరో నేత… ‘మన పార్టీలో అత్యుత్తమ పుకార్ల సృష్టికర్త దేవినేని ఉమానే’ అని ఒక బిరుదు కూడా పడేశాడట.

అందుకే పార్టీ అధినేతకు కూడా ఉమా అంటే చాలా ఇష్టమని సెటైర్లు వేసుకున్నారట. దాంతో అందరూ కాసేపు నవ్వుకుని వెళ్లిపోయారట.

First Published:  27 Aug 2019 12:08 AM GMT
Next Story