Telugu Global
CRIME

ఫేస్ బుక్ మోసాలు ఇన్నిన్ని కాదయా..!

ఎవరు ఎంత అప్రమత్తం చేసినా… ఎవరు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సోషల్ మీడియా మోసాలు నానాటికీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫేస్ బుక్ లో పెరుగుతున్న మోసాలు అటు పోలీసులను, ఇటు తల్లితండ్రులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా చెన్నైకి చెందిన మహ్మద్ సల్మాన్ నవాజ్ చదివింది కేవలం ఇంటర్. అది కూడా ఫెయిల్. ముంబైలో కొన్నాళ్లు ఉన్న మహ్మద్ సల్మాన్ నవాజ్ జల్సాలకు, వ్యసనాలకు బానిసయ్యాడు. సులభంగా డబ్బు సంపాదించి సుఖవంతమైన జీవితం గడపాలని ప్లాన్ […]

ఫేస్ బుక్ మోసాలు ఇన్నిన్ని కాదయా..!
X

ఎవరు ఎంత అప్రమత్తం చేసినా… ఎవరు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సోషల్ మీడియా మోసాలు నానాటికీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫేస్ బుక్ లో పెరుగుతున్న మోసాలు అటు పోలీసులను, ఇటు తల్లితండ్రులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి.

తాజాగా చెన్నైకి చెందిన మహ్మద్ సల్మాన్ నవాజ్ చదివింది కేవలం ఇంటర్. అది కూడా ఫెయిల్. ముంబైలో కొన్నాళ్లు ఉన్న మహ్మద్ సల్మాన్ నవాజ్ జల్సాలకు, వ్యసనాలకు బానిసయ్యాడు. సులభంగా డబ్బు సంపాదించి సుఖవంతమైన జీవితం గడపాలని ప్లాన్ వేశాడు. ఇందుకు ఫేస్ బుక్ సరైన మార్గమని, మహిళలకు మాయ మాటలు చెప్పి మోసం చేసి తన జల్సాలు తీర్చుకోవాలని పథకం రచించించాడు.

తన ఫేస్ ఖాతా నుంచి అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపేవాడు మహ్మద్ సల్మాన్ నవాజ్. ఒకసారి అతను పంపిన ఫ్రెండ్ రిక్వస్ట్ ను ఎవరైనా అంగీకరిస్తూ ఓకె చెప్పారా… ఇక ఆ అమ్మాయి సల్మాన్ నవాజ్ ఉచ్చులో పడినట్లే.

తాను ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ అని, తనకు వ్యాపార వేత్తలతోను, సినీ రంగానికి చెందిన వారితోనూ పరిచయాలున్నాయంటూ నమ్మబలుకుతాడు. తన వలలో పడ్డ వారిని మరింత నమ్మించేందుకు ప్రయివేట్ సెక్యురిటీ సిబ్బందిని కూడా నియమించుకున్నాడు. వారిని పక్కన నిలబెట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చే వాడు. వాటిని ఫేస్ బుక్ లో తనకు పరిచయమైన అమ్మాయిలకు పంపేవాడు.

అనంతరం తనను నమ్మారని నిర్ణయించుకున్న తరువాత వారి ఫొటోలు సేకరించడం, వారితో వీడియో చాట్ ప్రారంభించే వాడు. ఆ తర్వాత మహ్మద్ సల్మాన్ నవాజ్ తన అసలు వ్యవహారాన్ని నడిపేవాడు. అమ్మాయిలు పంపిన ఫొటోలను, వీడియో సందేశాలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో కంగారు పడిన అమ్మాయిలు అతను అడిగిన డబ్బులు ఇచ్చేవారు.

అయితే, నగరానికి చెందిన ఓ మహిళను బెదిరించి 13 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఎంత ఇచ్చినా తనను వదలకపోవడంతో విసిగిపోయిన ఆ మహిళ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ సోషల్ మీడియా నేరగాడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తనకంటే వయసులో 22 సంవత్సరాలు పెద్ద అయిన ఓ మహిళను తన ట్రాప్ లో వేసుకున్నాడు.

కొన్నాళ్లు చాటింగ్ చేసి ఆమెతో స్నేహంగా మెలిగిన మహ్మద్ సల్మాన్ నవాజ్ తనకు వ్యాపారంలో నష్టం వచ్చిందంటూ నమ్మించి కొంత సొమ్ము తన ఖాతాలో వేయించుకున్నాడు. అతడిని నమ్మిన ఆ మహిళ కొంత డబ్బు అతని అకౌంట్ లో వేసింది.

ఇక ఆ తర్వాత నేరుగా బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో అతని బాధ భరించలేకపోయిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఫేస్ బుక్ మోసం గట్టును రట్టు చేసి… మహ్మద్ సల్మాన్ నవాజ్ ను కటకటాల వెనక్కి పంపారు పోలీసులు.

First Published:  27 Aug 2019 12:00 AM GMT
Next Story