Telugu Global
NEWS

కూల్చివేతల్లోనూ కేసీఆర్ ది రికార్డే...

తెలంగాణలో ఏ అభివృద్ధి పని చేయాలన్నా కేసీఆర్ ముందరి కాళ్లకు కోర్టులతో బంధం వేయడానికి ప్రతిపక్షాలు కాచుకు కూర్చున్నాయి. పాలన సంస్కరణల్లో భాగంగా దేశం గర్వించే సెక్రెటేరియట్, అసెంబ్లీలను కడుదామని అనుకుంటే హైకోర్టుకెళ్లి అడ్డుకున్నారు. ఎర్రమంజిల్ కూలగొట్టనీయడం లేదు. సచివాలయానికి హైకోర్టు అడ్డుపుల్ల వేయలేదు. దీంతో ఉన్న ఫలంగా తెలంగాణ సెక్రెటేరియట్ ను కూలగొట్టి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అయితే బుల్డోజర్లు, కూలీలతో ఈ పనిచేస్తే నెలలు పడుతుంది. పైగా దుమ్ము ధూళితో మొత్తం పరిసరాలు, స్థానిక […]

కూల్చివేతల్లోనూ కేసీఆర్ ది రికార్డే...
X

తెలంగాణలో ఏ అభివృద్ధి పని చేయాలన్నా కేసీఆర్ ముందరి కాళ్లకు కోర్టులతో బంధం వేయడానికి ప్రతిపక్షాలు కాచుకు కూర్చున్నాయి. పాలన సంస్కరణల్లో భాగంగా దేశం గర్వించే సెక్రెటేరియట్, అసెంబ్లీలను కడుదామని అనుకుంటే హైకోర్టుకెళ్లి అడ్డుకున్నారు. ఎర్రమంజిల్ కూలగొట్టనీయడం లేదు. సచివాలయానికి హైకోర్టు అడ్డుపుల్ల వేయలేదు.

దీంతో ఉన్న ఫలంగా తెలంగాణ సెక్రెటేరియట్ ను కూలగొట్టి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అయితే బుల్డోజర్లు, కూలీలతో ఈ పనిచేస్తే నెలలు పడుతుంది. పైగా దుమ్ము ధూళితో మొత్తం పరిసరాలు, స్థానిక ఇళ్ల వాసులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది.

అందుకే సెక్రెటేరియట్ భవనాలను నిమిషంలో కూల్చివేయడంతోపాటు పెద్దగా కాలుష్యం వెదజల్లని విదేశాల్లో వాడే మెథడ్ ను కేసీఆర్ ఫాలో కాబోతున్నట్టు సమాచారం. దీనివల్ల అరనిమిషంలోనే తెలంగాణ సెక్రెటేరియట్ భూస్థాపితమై మళ్లీ నిర్మాణాలు చేసుకునే వీలు చిక్కుతుందట.

విదేశాల్లో భారీ భవనాలను కూల్చివేయడానికి ‘బిల్డింగ్ ఇంప్లోజన్’ అనే ఆధునిక సాంకేతిక పద్ధతిని వాడుతున్నారట.. ఆ సాంకేతికతలో భాగంగా బిల్డింగ్ పునాదులు, పిల్లర్లలో డ్రిల్లింగ్ చేసి డైనమెట్లను అమర్చి ఓ క్రమ పద్ధతిలో పేల్చడం ద్వారా భవింతని 15 సెకండ్లలోనే కూల్చివేస్తారట.

ఈ పద్ధతితో చుట్టుపక్కల ఉన్న ఇతర భవనాలకు, స్థానికులకు దుమ్ము దూళితో ఎటువంటి నష్టం వాటిల్లదట.. సో ఈ ఆధునిక పద్ధతిని కేసీఆర్ వీటిని కూలగొట్టడానికి వాడుతున్నట్టు సమాచారం.

అయితే దీనికి ఖర్చు కూడా భారీగా అవుతోందని తెలుస్తోంది. 5 లక్షల చదరపు అడుగుల సెక్రెటేరియట్ కూలగొట్టడానికి దాదాపు 10 కోట్లు ఈ పద్ధతిలో ఖర్చు అవుతుందని తెలుస్తోంది.

First Published:  26 Aug 2019 10:38 PM GMT
Next Story