Telugu Global
Cinema & Entertainment

సాహోకు సంబంధించి హాట్ న్యూస్

దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమాకు సంబంధించి మరో హాట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశాడట. రిలీజ్ కు సరిగ్గా వారం రోజుల ముందు వచ్చిన ఈ న్యూస్, ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. నిజానికి ఈ ప్రశ్న, 2 రోజుల కిందటే ప్రభాస్ కు ఎదురైంది. ఈ సినిమాలో మీరు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారా అంటూ […]

సాహోకు సంబంధించి హాట్ న్యూస్
X

దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమాకు సంబంధించి మరో హాట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశాడట. రిలీజ్ కు సరిగ్గా వారం రోజుల ముందు వచ్చిన ఈ న్యూస్, ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు.

నిజానికి ఈ ప్రశ్న, 2 రోజుల కిందటే ప్రభాస్ కు ఎదురైంది. ఈ సినిమాలో మీరు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారా అంటూ ఓ బాలీవుడ్ మీడియా ప్రతినిధి ప్రభాస్ ను ప్రశ్నించాడు.

అయితే దీనికి ప్రభాస్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు. సాహో అనేది స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా అని, అందులో తన పాత్ర రకరకాలుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. చాలా షేడ్స్ లో తాను కనిపిస్తానని మాత్రమే చెప్పుకొచ్చిన ప్రభాస్, ద్విపాత్రాభినయం చేసిన విషయాన్ని మాత్రం నేరుగా నిర్థారించలేదు.

నిజంగా ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తే అదే ఈ సినిమాకు పెద్ద హైలెట్ అవుతుంది. సినిమా మొత్తం తన పాత్ర చుట్టూ తిరుగుతుందని, తన పాత్రలో చాలా ట్విస్ట్ లు ఉంటాయని ప్రభాస్ పదేపదే చెబుతుండడానికి ఇదే కారణం కావొచ్చని కూడా కొంతమంది భావిస్తున్నారు.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి అనుకున్న పెయిడ్ ప్రీమియర్స్ పై మేకర్స్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీనికోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. విడుదలకు సరిగ్గా 4 రోజుల ముందు ఈ తలనొప్పి పెట్టుకోవడం ఎందుకనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. పెయిడ్ ప్రీమియర్స్ బదులు.. రిలీజ్ రోజు ఉదయాన్నే 5 గంటలకు షో వేయాలని ఆలోచిస్తున్నారు. అయితే ఇలా చేస్తే బాహుబలి-2 రికార్డులు బద్దలుకొట్టడం కష్టమంటున్నారు ఫ్యాన్స్.

First Published:  26 Aug 2019 10:22 PM GMT
Next Story