Telugu Global
Cinema & Entertainment

ముచ్చటగా మూడవసారి

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా మారిన సంపూర్ణేష్ బాబు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. తాజాగా ‘కొబ్బరి మట్ట’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంపూ ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని సాధించాడు. సంపూర్ణేష్ బాబు మరియు దర్శకుడు స్టీవెన్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ఇది. రెండు సినిమాలు హిట్టయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ ముచ్చటగా మూడవసారి రిపీట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. […]

ముచ్చటగా మూడవసారి
X

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా మారిన సంపూర్ణేష్ బాబు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. తాజాగా ‘కొబ్బరి మట్ట’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంపూ ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని సాధించాడు.

సంపూర్ణేష్ బాబు మరియు దర్శకుడు స్టీవెన్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ఇది. రెండు సినిమాలు హిట్టయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ ముచ్చటగా మూడవసారి రిపీట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి స్టీవెన్ శంకర్ అసలు పేరు సాయి రాజేష్. స్టీవెన్ స్పీల్బర్గ్ మరియు శంకర్ సినిమాలకు స్పూఫ్ గా ‘హృదయ కాలేయం’ మరియు ‘కొబ్బరిమట్ట’ సినిమాలను తీశాడు స్టీవెన్ శంకర్. రెండు సినిమాలు బాగా ఆడటంతో ఇప్పుడు మళ్లీ సంపూర్ణేష్ బాబు ని హీరోగా పెట్టి మరొక సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు.

ఇప్పటికే పలువురు ప్రముఖ నిర్మాతలు కూడా ఇతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతుండగా మరోవైపు శంకర్ మాత్రం సంపూర్ణేష్ బాబు తోనే మూడవసారి చేతులు కలపాలని చూస్తున్నారట. మరి వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూడో సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాల్సిందే.

First Published:  26 Aug 2019 8:49 PM GMT
Next Story