Telugu Global
NEWS

ప్రపంచ బ్యాడ్మింటన్ క్వీన్ సింధు

ప్రపంచ టైటిల్ తో సింధు సరికొత్త చరిత్ర ఐదు ప్రపంచకప్ పతకాలతో రికార్డు… తెలుగుతేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ టైటిల్ నెగ్గిన భారత తొలిమహిళగా రికార్డుల్లో చేరింది. ప్రపంచ బ్యాడ్మింటన్ లో భారత తొలి విజేత ప్రకాశ్ పడుకోన్ సరసన నిలిచింది. స్విట్జర్లాండ్ లోని బాసెల్ వేదికగా ముగిసిన 2019 ప్రపంచ బ్యాడ్మింటన్ బంగారు పతకంతో తన కెరియర్ లోనే అత్యుత్తమ ఘనత సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళలసింగిల్స్ టైటిల్ సాధించాలన్న తన జీవిత లక్ష్యాన్ని […]

ప్రపంచ బ్యాడ్మింటన్ క్వీన్ సింధు
X
  • ప్రపంచ టైటిల్ తో సింధు సరికొత్త చరిత్ర
  • ఐదు ప్రపంచకప్ పతకాలతో రికార్డు…

తెలుగుతేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ టైటిల్ నెగ్గిన భారత తొలిమహిళగా రికార్డుల్లో చేరింది. ప్రపంచ బ్యాడ్మింటన్ లో భారత తొలి విజేత ప్రకాశ్ పడుకోన్ సరసన నిలిచింది.

స్విట్జర్లాండ్ లోని బాసెల్ వేదికగా ముగిసిన 2019 ప్రపంచ బ్యాడ్మింటన్ బంగారు పతకంతో తన కెరియర్ లోనే అత్యుత్తమ ఘనత సాధించింది.

ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళలసింగిల్స్ టైటిల్ సాధించాలన్న తన జీవిత లక్ష్యాన్ని తెలుగుతేజం పీవీ సింధు ఎట్టకేలకు సాకారం చేసుకోగలిగింది. గత ఎనిమిది సంవత్సరాలలో ఐదు ప్రపంచకప్ పతకాలతో సరికొత్త చరిత్ర సృష్టించింది.

గతంలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలలో రెండేసి రజత, కాంస్యాలు మాత్రమే సాధించిన 24 ఏళ్ల సింధు..2019 టోర్నీలో మాత్రం స్వర్ణపతకంతో తనకు తానే సాటిగా నిలిచింది.

క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండోర్యాంకర్ తాయ్ ఈ జింగ్ ను మూడు గేమ్ ల పోరులో అధిగమించడంతోనే సింధుకు టైటిల్ ఖాయమైపోయింది. నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో సింధు 12-21, 23-21, 21-19 తో తాయ్ జును అధిగమించింది.

ఇక… సెమీఫైనల్లో 4వ ర్యాంకర్, చైనీస్ స్టార్ చెన్ యూ ఫేను 21-7, 21-14తో చిత్తు చేసి వరుసగా రెండో ఏడాది ఫైనల్లో అడుగుపెట్టింది.

ఏకపక్షంగా సాగిన టైటిల్ సమరంలో సింధు 21-7,21-7తో ప్రపంచ మూడోర్యాంకర్, ప్రపంచ మాజీ చాంపియన్ నజోమీ ఒకుహరాను చిత్తుగా ఓడించి తొలి ప్రపంచ టైటిల్ ను అందుకొంది.

ఐదు పతకాలతో టాప్…

గత ఎనిమిదేళ్లుగా ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలలో పాల్గొంటూ వస్తున్న సింధు.. ఐదు పతకాలు సాధించడం ద్వారా… ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళగా, ఏకైక ప్లేయర్ గా సంచలనం సృష్టించింది.

2013, 2014 ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలలో కాంస్య పతకాలు, 2017, 2018 టోర్నీలలో రజత పతకాలు సాధించిన సింధు.. 2019 టోర్నీలో మాత్రం బంగారు పతకంతో తనకు తానే సాటిగా నిలిచింది.

కేవలం ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలలోనే ఐదు పతకాలు సాధించిన భారత తొలి మహిళగా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకోగలిగింది.

1980 లో ప్రకాశ్- 2019లో సింధు..

ప్రపంచ బ్యాడ్మింటన్ లో విజేతగా నిలవడం, బంగారు పతకం అందుకోడం బ్యాడ్మింటన్ ప్లేయర్ల జీవితలక్ష్యంగా ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోగల సత్తా, అదృష్టం మాత్రం కేవలం అతికొద్ది మంది క్రీడాకారులకు మాత్రమే ఉంటుంది.

1980 ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో ప్రకాశ్ పడుకోన్ బంగారు పతకంతో పాటు విశ్వవిజేత టైటిల్ ను అందుకొన్న తర్వాత 38 ఏళ్ల తర్వాత.. మహిళల సింగిల్స్ లో సింధు ప్రపంచ చాంపియన్ గా నిలవడం విశేషం.

130 కోట్ల భారత జాతికే గర్వకారణంగా నిలిచిన స్వర్ణ విజేత సింధు తెలుగు రాష్ట్ర్రాల ప్రజలకే గర్వకారణంగా నిలిచిపోతుంది.

First Published:  26 Aug 2019 11:20 PM GMT
Next Story