Telugu Global
NEWS

నోటి దూల నాయకుడు... ఆరెస్టు కాక తప్పదా?

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారబలంతో విచ్చలవిడిగా అధికారం చెలాయించిన నేతలు వాళ్లు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా అదే దూకుడును కొనసాగిస్తూ అధికారులను బెంబేలెత్తించారు. అధికారులు ఊరుకుంటారా? లేదు. అందుకే ఇప్పుడు బెదిరించిన టీడీపీ నేతపై పోరుబాట పట్టారు. దీంతో మరో టీడీపీ నేత కటకటాల పాలు కావడానికి రెడీ అయ్యారు. టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ అరెస్ట్ కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈయన ఏకంగా ప్రభుత్వ ఆఫీసుకు […]

నోటి దూల నాయకుడు... ఆరెస్టు కాక తప్పదా?
X

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారబలంతో విచ్చలవిడిగా అధికారం చెలాయించిన నేతలు వాళ్లు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా అదే దూకుడును కొనసాగిస్తూ అధికారులను బెంబేలెత్తించారు. అధికారులు ఊరుకుంటారా? లేదు. అందుకే ఇప్పుడు బెదిరించిన టీడీపీ నేతపై పోరుబాట పట్టారు. దీంతో మరో టీడీపీ నేత కటకటాల పాలు కావడానికి రెడీ అయ్యారు.

టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ అరెస్ట్ కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈయన ఏకంగా ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లి అధికారులను బెదిరించి భయభ్రాంతులకు గురిచేశారు. తాజాగా సరుబుజ్జిలి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన కూన రవికుమార్ టీడీపీ నేతలు తెచ్చిన దరఖాస్తులు తీసుకోరా అంటూ అధికారులను బెదిరించాడు. ఒక గదిలో వేసి చావకొడుతానంటూ హెచ్చరించారు.

దీంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూన ఆగడాలపై సీరియస్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవికుమార్ ను అరెస్ట్ చేయకపోతే మూకుమ్మడి సెలవులు పెడుతామని హెచ్చరించారు..

ప్రభుత్వ అధికారులనే బెదిరించిన కూన రవికుమార్ అరెస్ట్ కు పోలీసులు రంగం సిద్దం చేశారు. అరెస్ట్ కోసం ఆముదాల వలసలోని కూనను విచారించడానికి ఆయన ఇంటికి వెళ్లగా కూన పారిపోయారని తెలిసింది. అజ్జాతంలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

టీడీపీ అధికారంలో ఉండగా చెలరేగిపోయిన ఇతను వైసీపీ ప్రభుత్వంలోనూ అదే దూకుడు ప్రదర్శించే సరికి ఇప్పుడు కటకటాల పాలు కాబోతున్నాడు.

First Published:  28 Aug 2019 12:37 AM GMT
Next Story