Telugu Global
NEWS

విశ్వవిజేత సింధుకు మోడీ హ్యాట్సాఫ్

సింధుకు కేంద్రం 10 లక్షల నజరానా ప్రధానిని మర్యాదపూర్వకంగా కలసిన బ్యాడ్మింటన్ క్వీన్ భారత బ్యాడ్మింటన్ క్వీన్, ప్రపంచ నయా చాంపియన్ పీవీ సింధు.. స్విట్జర్లాండ్ లోని బాసెల్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ, క్రీడామంత్రి కిరణ్ రిజ్జు, కేంద్ర క్రీడాశాఖ కార్యదర్శి, ఇతర అధికారులను మర్యాద పూర్వకంగా కలసింది. న్యూఢిల్లీలో కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజ్జు..సింధు గౌరవార్థం తన నివాసంలో అల్పాహారం ఇచ్చారు. ఆ తర్వాత ప్రధాని నివాసానికి వెళ్లి మర్యాదపూర్వంగా […]

విశ్వవిజేత సింధుకు మోడీ హ్యాట్సాఫ్
X
  • సింధుకు కేంద్రం 10 లక్షల నజరానా
  • ప్రధానిని మర్యాదపూర్వకంగా కలసిన బ్యాడ్మింటన్ క్వీన్

భారత బ్యాడ్మింటన్ క్వీన్, ప్రపంచ నయా చాంపియన్ పీవీ సింధు.. స్విట్జర్లాండ్ లోని బాసెల్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ, క్రీడామంత్రి కిరణ్ రిజ్జు, కేంద్ర క్రీడాశాఖ కార్యదర్శి, ఇతర అధికారులను మర్యాద పూర్వకంగా కలసింది.

న్యూఢిల్లీలో కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజ్జు..సింధు గౌరవార్థం తన నివాసంలో అల్పాహారం ఇచ్చారు. ఆ తర్వాత ప్రధాని నివాసానికి వెళ్లి మర్యాదపూర్వంగా కలసి.. తాను సాధించిన ప్రపంచ పతకాన్ని సింధు ప్రధానికి చూపించి ప్రశంసలు అందుకొంది.

దేశానికే గర్వకారణం సింధు….

ప్రపంచ బ్యాడ్మింటన్ టైటిల్ నెగ్గిన తొలి భారత మహిళ పీవీ సింధు దేశానికే గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. సింధు సాధించిన ఈ మహావిజయం దేశంలోని కోట్లాదిమంది యువతరానికి స్ఫూర్తికావాలని కోరారు.

సింధుతో పాటు చీఫ్ కోచ్ గోపీచంద్, కొరియా శిక్షకుడు కిమ్ జూ హ్యూన్, భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు, క్రీడామంత్రి కిరణ్ రిజ్జు ప్రధానిని కలసిన వారిలో ఉన్నారు.

ప్రపంచ విజేత సింధుకు కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ తరపున క్రీడామంత్రి కిరణ్ రిజ్జు 10 లక్షల రూపాయల చెక్ ను అంద చేశారు.
24 ఏళ్ల సింధుకు గత తొమ్మిదేళ్ల కాలంలో ఐదు ప్రపంచ బ్యాడ్మింటన్ పతకాలు సాధించిన అరుదైన ఘనత ఉంది.

అంతేకాదు…వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో సైతం హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది.

First Published:  28 Aug 2019 12:05 AM GMT
Next Story