Telugu Global
Cinema & Entertainment

ఆర్ఆర్ఆర్.... బల్గెరియాలో తారక్

దర్శకడు రాజమౌళి మొన్నీ మధ్య వరకు హైదరాబాద్ లో నే ఉన్నాడు. సాహో సినిమా కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా హాజరు అయిన ఈ దర్శకుడు ఆ వెంటనే మళ్ళీ తన సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ పనులు పూర్తి అయ్యాయి కూడా. నిన్నటి నుంచి బల్గెరియా లో ఈ సినిమా షూటింగ్ కి సంబందించిన కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలని రాజమౌళి చిత్రీకరించడం మొదలు పెట్టారు. […]

ఆర్ఆర్ఆర్.... బల్గెరియాలో తారక్
X

దర్శకడు రాజమౌళి మొన్నీ మధ్య వరకు హైదరాబాద్ లో నే ఉన్నాడు. సాహో సినిమా కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా హాజరు అయిన ఈ దర్శకుడు ఆ వెంటనే మళ్ళీ తన సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ పనుల్లో నిమగ్నమయ్యాడు.

ఈ సినిమా కొత్త షెడ్యూల్ పనులు పూర్తి అయ్యాయి కూడా. నిన్నటి నుంచి బల్గెరియా లో ఈ సినిమా షూటింగ్ కి సంబందించిన కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలని రాజమౌళి చిత్రీకరించడం మొదలు పెట్టారు.

అయితే బల్గెరియా లో ఇంతకు ముందు బాహుబలి సినిమా కి సంబందించిన షూటింగ్ కూడా చేశారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన సీన్స్ ను కూడా షూట్ చేస్తున్నారట.

ఈ షెడ్యూల్ లో కేవలం కొమరం భీం పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ కి సంబందించిన సన్నివేశాలను మాత్రమే తీస్తున్నారని చెబుతున్నారు. ఇక్కడి షూటింగ్ పార్ట్ అయిపోయాక… హైదరాబాద్ లో మరో షెడ్యూల్ స్టార్ అవబోతోందట.

సై రా విడుదల వరకు రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ కి అందుబాటు లో ఉండే అవకాశం లేనందున… ఆ లోపు తారక్ పార్ట్ ను కంప్లీట్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేశాడట.

First Published:  27 Aug 2019 11:52 PM GMT
Next Story