Telugu Global
Cinema & Entertainment

స్పెయిన్ లో సమంత ఏం చేస్తోంది?

సమంత లైఫ్‌ని ఫుల్లుగా ఎంజాయ్‌ చేస్తోంది. సమంత లైఫ్‌స్టయిల్‌ అలా రిచ్‌గా ఉంటుంది మరి. సమంత గర్భవతిగా మారిందని…అందుకే ఆమె పబ్లిక్‌గా దర్శనమివ్వడం లేదనేది టాక్‌. ఇలాంటి గాసిప్‌లు చాలా షికార్లు చేస్తున్నాయి. అయితే… సమంత ఆ రూమర్లకి చెక్‌ పెడుతూ కొత్త ఫోటోలను, వీడియోలను అప్‌డేట్‌ చేస్తోంది. రీసెంట్‌గా ఒక ఎక్సర్‌సైజ్‌ వీడియోని షేర్‌ చేసింది. గర్భవతి అయితే అలాంటి ఎక్సర్‌సైజ్‌లు చేయను కదా అని ఇన్‌డైరక్ట్‌గా చెప్పింది. ఇక లేటేస్ట్‌గా స్పెయిన్‌ నుంచి ఫోటోలను […]

స్పెయిన్ లో సమంత ఏం చేస్తోంది?
X

సమంత లైఫ్‌ని ఫుల్లుగా ఎంజాయ్‌ చేస్తోంది. సమంత లైఫ్‌స్టయిల్‌ అలా రిచ్‌గా ఉంటుంది మరి. సమంత గర్భవతిగా మారిందని…అందుకే ఆమె పబ్లిక్‌గా దర్శనమివ్వడం లేదనేది టాక్‌. ఇలాంటి గాసిప్‌లు చాలా షికార్లు చేస్తున్నాయి.

అయితే… సమంత ఆ రూమర్లకి చెక్‌ పెడుతూ కొత్త ఫోటోలను, వీడియోలను అప్‌డేట్‌ చేస్తోంది. రీసెంట్‌గా ఒక ఎక్సర్‌సైజ్‌ వీడియోని షేర్‌ చేసింది. గర్భవతి అయితే అలాంటి ఎక్సర్‌సైజ్‌లు చేయను కదా అని ఇన్‌డైరక్ట్‌గా చెప్పింది. ఇక లేటేస్ట్‌గా స్పెయిన్‌ నుంచి ఫోటోలను అప్‌డేట్‌ చేస్తోంది.

భర్త చైతన్య, ఆయన ఫ్రెండ్స్‌తో కలిసి సమంత స్పెయిన్‌ ట్రిప్పు వేసింది. ఆ ట్రిప్పు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హో బేబీ హిట్ తర్వాత ఫుల్ జోష్ లోకి వచ్చేసింది సమంత. నెక్ట్స్ చేసే సినిమాను ఆచితూచి ఎంపిక చేసుకుంటోంది.

ప్రస్తుతానికైతే సమంత మనసుకు నచ్చిన కథ దొరకలేదట. కానీ ఓ వెబ్ సిరీస్ మాత్రం ఆమెకు బాగా నచ్చింది. అందుకే వెంటనే అందులో నటించడానికి అంగీకరించింది. స్పెయిన్ టూర్ కంప్లీట్ అయిన వెంటనే ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సమంత లీడ్ రోల్ లో కొత్త సినిమా ప్రకటన వస్తుంది.

First Published:  27 Aug 2019 11:34 PM GMT
Next Story