Telugu Global
NEWS

85 ఏళ్ల వయసులో క్రికెట్ రిటైర్మెంట్

60 ఏళ్లపాటు క్రికెట్ ఆడిన కరీబియన్ ఫాస్ట్ బౌలర్ 7వేల వికెట్ల మొనగాడు సిసిల్ రైట్ పెద్దమనుషుల క్రీడ క్రికెట్లో ఆటగాళ్లు రిటైర్ కావడం సాధారణ విషయమే. అయితే…ఇంగ్లీష్ క్రికెట్లో మాత్రం ఓ అసాధారణ రిటైర్మెంట్ చోటు చేసుకొంది. ఊహించడానికే అసాధ్యమనే రీతిలో…85 సంవత్సరాల లేటు వయసులో సిసిల్ రైట్ అనే కరీబియన్ ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించాడు. సెప్టెంబర్ 7న తన ఆఖరు మ్యాచ్ ను ఇంగ్లీష్ కౌంటీలోని అప్పర్ మిల్ కౌంటీ […]

85 ఏళ్ల వయసులో క్రికెట్ రిటైర్మెంట్
X
  • 60 ఏళ్లపాటు క్రికెట్ ఆడిన కరీబియన్ ఫాస్ట్ బౌలర్
  • 7వేల వికెట్ల మొనగాడు సిసిల్ రైట్

పెద్దమనుషుల క్రీడ క్రికెట్లో ఆటగాళ్లు రిటైర్ కావడం సాధారణ విషయమే. అయితే…ఇంగ్లీష్ క్రికెట్లో మాత్రం ఓ అసాధారణ రిటైర్మెంట్ చోటు చేసుకొంది.

ఊహించడానికే అసాధ్యమనే రీతిలో…85 సంవత్సరాల లేటు వయసులో సిసిల్ రైట్ అనే కరీబియన్ ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించాడు.

సెప్టెంబర్ 7న తన ఆఖరు మ్యాచ్ ను ఇంగ్లీష్ కౌంటీలోని అప్పర్ మిల్ కౌంటీ తరపున ఆడనున్నట్లు ప్రకటించాడు.

క్రికెట్ కోసమే పుట్టిన ఆటగాడు….

కరీబియన్ ద్వీపాలలో 85 సంవత్సరాల క్రితం జన్మించిన సిసిల్ నైట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తీరిక, కోరిక, నేర్పు, ఓర్పు ఉండాలే కానీ…క్రికెట్ కు వయసు ఏమాత్రం అడ్డుకాదని…క్రికెట్ అంటే కుర్రాళ్ల ఆట ఏమాత్రం కాదని 85 ఏళ్ల వయసు వరకూ క్రికెటర్ గా కొనసాగి అరుదైన రికార్డు నెలకొల్పాడు.

ఫాస్ట్ బౌలర్ గా తన కెరియర్ ప్రారంభించిన సిసిల్ రైట్…జమైకా జట్టులో సభ్యుడిగా సర్ గార్ ఫీల్డ్ సోబర్స్,వెస్లీ హాల్ లాంటి దిగ్గజాలతో తలపడ్డాడు.

1959లో ఇంగ్లండ్ కు వలస…

కరీబియన్ ద్వీపాలలో క్రికెటర్ గా తన కెరియర్ ప్రారంభించినా…1959లో సిసిల్ ఇంగ్లండ్ కు వలస వచ్చాడు.సెంట్రల్ లాంక్ షైర్ లీగ్ లో క్రాంప్టన్ జట్టులో సభ్యుడిగా తన కెరియర్ ప్రారంభించాడు.

మూడేళ్లపాటు కౌంటీ క్రికెట్ ఆడిన సిసిలీ..ఆ తర్వాత ఇంగ్లండ్ పౌరసత్వం సంపాదించాడు.

1970- 80 మధ్యకాలంలోనే సిసిల్ 7వేల వికెట్లు పడగొట్టి వారేవ్వా అనిపించుకొన్నాడు. ఐదుసంవత్సరాల సీజన్లోనే .. 28బాల్స్ కు ఓ వికెట్ చొప్పున..మొత్తం 7వేల వికెట్లు సాధించగలిగాడు.

ప్రతి 27వ బంతికీ ఓ వికెట్ పడగొడుతూ ఐదుసంవత్సరాల కాలంలో 538 వికెట్లు పడగొట్టాడు. 85 సంవత్సరాల తన జీవితంలో 60 ఏళ్లపాటు క్రికెట్ ఆడి..చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానం సంపాదించాడు. తన కెరియర్ లో ఇప్పటి వరకూ 20 లక్షలకు పైగా మ్యాచ్ లు ఆడానని తెలిపాడు.

అదే విజయ రహస్యం…

85 సంవత్సరాలపాటు క్రికెట్ ఆడుతూ రావటానికి…వ్యక్తిగతంగా తాను పాటించిన క్రమశిక్షణే ప్రధాన కారణమని ప్రకటించారు. మద్యానికి దూరంగా ఉంటూ.. అప్పుడప్పుడూ బీర్ మాత్రమే సేవిస్తూ తన కెరియర్ ను కొనసాగించినట్లు 85 ఏళ్ల సిసిల్ తెలిపారు.

ఆరుదశాబ్దాల తన కెరియర్ లో దాదాపు 20 లక్షల మ్యాచ్ లు ఆడినట్లు సిసిల్ తెలిపాడు. లాంక్ షైర్ లీగ్ లో ఆడుతున్న సమయంలో తమకు అందుబాటులో ఉంచిన ఆహారమే తన ఫిట్ నెస్ కు కారణమని, ఫిట్ గా ఉండటానికి రోజువారీ సాధన చేస్తూ వచ్చానని సిసిల్ గుర్తు చేసుకొన్నాడు.

వయసు మీద పడిపోయిందంటూ బెంబేలెత్తకుండా రోజువారీ వ్యాయామంతో ఫిట్ నెస్ కాపాడుకొంటూ వచ్చినట్లు ప్రకటించాడు.
చురుకుగా ఉండటం ద్వారా మోకాళ్లు, కాలిమడమల నొప్పులు రాకుండా కాపాడుకోగలిగానని చెప్పాడు.

టీవీలు,సినిమాలు చూడటం వల్ల కాలక్షేపం మినహా ఒరిగేదేమీ లేదని తెలిపాడు.

సెప్టెంబర్ 7న వో్ల్డ్ హ్యామ్ వేదికగా జరిగే మ్యాచ్ లో అప్పర్ మిల్ జట్టు సభ్యుడిగా…స్ప్రింగ్ హెడ్ జట్టుతో సిసిల్ రైట్ తన వీడ్కోలు మ్యాచ్ ను ఆడనున్నాడు.

ఒకటి కాదు రెండు కాదు…ఏకంగా 60 ఏళ్లపాటు ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ లో పాల్గొన్న సిసిల్ 85 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించడం అపూర్వ, అనిర్వచనీయం కాక మరేమిటి.

First Published:  29 Aug 2019 6:03 AM GMT
Next Story