నాగార్జునతో కాదట… రవి తేజ తో చేస్తున్నాడట!

గోపీచంద్ మలినేని ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా పనుల్లో బిజీ గా ఉన్నాడు…. అయితే ఆయన రవి తేజ తో ప్రాజెక్ట్ చేస్తుంటే మీడియా లో మాత్రం నాగార్జున తో సినిమా చేస్తున్నాడనే వార్తలు ఎక్కువయ్యాయి.

అయితే ఈ వార్తలపై దర్శకుడు గోపీచంద్ మలినేని ట్విట్టర్ లో స్పందించాడు.

“నా తదుపరి సినిమా గురించి ఒక తప్పుడు వార్త ప్రచారం లో ఉంది. అందుకే నేను ఒక అప్డేట్ ఇస్తున్నాను. నా తరువాతి సినిమా రవి తేజ గారితో ఉంటుంది. ఆ సినిమా కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగం గా సాగుతున్నాయి. అది పూర్తి అవ్వగానే మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఈసారి మేము మళ్ళీ స్ట్రాంగ్ గా తిరిగి రానున్నాము.” అని గోపీచంద్ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

ఇంతకు ముందు ఇద్దరూ కలిసి డాన్ శీను, బలుపు అనే సినిమాలు చేశారు. ఈ కొత్త చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.