Telugu Global
Cinema & Entertainment

ఒక్క పాట కి రెండు కోట్లు ఇచ్చారట ..!

సాహో చిత్రం లో ని పాటలు స్క్రీన్ మీద చూడటానికి అద్భుతం గా ఉంటాయని చెబుతుంది సినిమా యూనిట్. అయితే ప్రత్యేకం గా బ్యాడ్ బాయ్ అనే పాట మాత్రం స్క్రీన్ మీద చాలా గొప్పగా ఉంటుందని, అందరికీ ఎంతగానో నచ్చుతుందని చెప్తున్నారు. దానికి ప్రధాన కారణం ఆ పాట లో ప్రభాస్ తో పాటు డ్యాన్స్ చేసిన జక్వెలీన్ ఫెర్నాండెస్. అయితే తాజాగా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న న్యూస్…. ఈ ఒక్క పాట కోసం […]

ఒక్క పాట కి రెండు కోట్లు ఇచ్చారట ..!
X

సాహో చిత్రం లో ని పాటలు స్క్రీన్ మీద చూడటానికి అద్భుతం గా ఉంటాయని చెబుతుంది సినిమా యూనిట్.

అయితే ప్రత్యేకం గా బ్యాడ్ బాయ్ అనే పాట మాత్రం స్క్రీన్ మీద చాలా గొప్పగా ఉంటుందని, అందరికీ ఎంతగానో నచ్చుతుందని చెప్తున్నారు. దానికి ప్రధాన కారణం ఆ పాట లో ప్రభాస్ తో పాటు డ్యాన్స్ చేసిన జక్వెలీన్ ఫెర్నాండెస్.

అయితే తాజాగా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న న్యూస్…. ఈ ఒక్క పాట కోసం ఈ అందాల భామకి దాదాపుగా రెండు కోట్ల రూపాయలు పారితోషికం గా ఇచ్చారని తెలుస్తోంది. అత్యంత అందమైన లొకేషన్స్ లో ఈ పాట ని చిత్రీకరించారు. పాట కూడా అదే రేంజ్ లో వచ్చింది అంటున్నారు అందరూ.

ఈ సినిమా మేకింగ్ పరం గా అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశంతో సినిమాకి భారీ గా ఖర్చు పెట్టారని టాక్. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ని యువీ క్రియేషన్స్ నిర్మించింది.

First Published:  29 Aug 2019 4:08 AM GMT
Next Story