‘జోడి’ ట్రైలర్ తో…. ఆది సాయి కుమార్

‘బుర్ర కథ’ సినిమా తో డిజాస్టర్ అందుకున్న యువ హీరో ఆది సాయికుమార్ ప్రస్తుతం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కొత్త దర్శకుడు విశ్వనాధ్ ఏ దర్శకత్వంలో ‘జోడి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ మధ్యనే ‘జెర్సీ’ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రద్ధాశ్రీ నాథ్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ చూస్తే ఈ సినిమా ఒక ఫుల్ లెన్త్ రొమాంటిక్ ప్రేమకథ అని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ట్రైలర్ చూస్తే పాతకాలపు ఆలోచనలు ఉన్న కాంచనమాల (శ్రద్ధ శ్రీనాథ్) తో ఆది ఎలా ప్రేమలో పడ్డాడు? వాళ్ళ కథ ఎలా ఉండబోతుంది? అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

వి కె నరేష్, సత్య, వెన్నెల కిషోర్, స్వప్నిక, సితార, మాధవి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భావన క్రియేషన్స్ పతాకంపై సాయి వెంకటేష్ గుర్రం మరియు పద్మజ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఫణి కల్యాణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదలకు సిద్ధమవుతోంది.