Telugu Global
Cinema & Entertainment

మీకు మాత్రమే చెప్తా....

విజయ్ దేవరకొండ హీరోగా టాలీవుడ్ లో తక్కువ టైమ్ లోనే స్టార్ డమ్ ను సంపాధించాడు. అయితే హీరో గానే కాక ఇప్పుడు విజయ్ నిర్మాత గా తన లక్ ని పరీక్షించుకోబోతున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా లో తరుణ్ భాస్కర్ ని హీరో గా పెట్టాడు విజయ్. ఈ సినిమా కి సంబందించిన టైటిల్ ని నిన్న ప్రకటించారు. “మేము అందరము సినిమా పరిశ్రమ లో కి ఎంటర్ అవుదాం అని నిర్ణయించుకుని ఒక […]

మీకు మాత్రమే చెప్తా....
X

విజయ్ దేవరకొండ హీరోగా టాలీవుడ్ లో తక్కువ టైమ్ లోనే స్టార్ డమ్ ను సంపాధించాడు. అయితే హీరో గానే కాక ఇప్పుడు విజయ్ నిర్మాత గా తన లక్ ని పరీక్షించుకోబోతున్నాడు.

అంతే కాకుండా ఈ సినిమా లో తరుణ్ భాస్కర్ ని హీరో గా పెట్టాడు విజయ్. ఈ సినిమా కి సంబందించిన టైటిల్ ని నిన్న ప్రకటించారు.

“మేము అందరము సినిమా పరిశ్రమ లో కి ఎంటర్ అవుదాం అని నిర్ణయించుకుని ఒక సినిమా చేద్దాం అనుకుంటున్న సమయం లో ఒక రోజున నేను నిర్మాణ సంస్థ పెట్టి సినిమా తీయాలి అని అనుకున్నాను. కానీ అది ఎంత పెద్ద రిస్క్ అనేది చేస్తున్నప్పుడు నాకు అర్ధం అయ్యింది. అయినా ఛాలెంజ్ లేకుంటే జీవితం ఏముంది? ఈ సినిమా కోసం నా దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ పెట్టేశాను. మా కింగ్ ఆఫ్ ధీ హిల్ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న టైటిల్ ‘మీకు మాత్రమే చెప్తా'” అని విజయ్ దేవరకొండ చెప్తూ ఒక వీడియో విడుదల చేసాడు.

ఆ వీడియో లో విజయ్ దేవరకొండ మరియు తరుణ్ భాస్కర్ సంభాషణ ఉంది. ఇద్దరూ కలిసి ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు.

First Published:  29 Aug 2019 12:17 AM GMT
Next Story