Telugu Global
Cinema & Entertainment

మరో బోల్డ్ సినిమాలో.... పాయల్

‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో తన అందచందాలతో ప్రేక్షకుల మతిపోగొట్టిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు ‘ఆర్ డి ఎక్స్’ సినిమాలో మళ్లీ తన అందాలను ఆరబోస్తుంది. శంకర్ భాను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అయితే ‘ఆర్ఎక్స్ 100’ సినిమా లో లాగానే ‘ఆర్డీఎక్స్’ సినిమాలో కూడా పాయల్ రాజ్ పుత్ కొన్ని ఇంటిమేట్ సన్నివేశాల్లో నటిస్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా […]

మరో బోల్డ్ సినిమాలో.... పాయల్
X

‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో తన అందచందాలతో ప్రేక్షకుల మతిపోగొట్టిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు ‘ఆర్ డి ఎక్స్’ సినిమాలో మళ్లీ తన అందాలను ఆరబోస్తుంది. శంకర్ భాను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అయితే ‘ఆర్ఎక్స్ 100’ సినిమా లో లాగానే ‘ఆర్డీఎక్స్’ సినిమాలో కూడా పాయల్ రాజ్ పుత్ కొన్ని ఇంటిమేట్ సన్నివేశాల్లో నటిస్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా అడల్ట్ కామెడీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.

వి కె నరేష్, నాగినీడు, తేజస్ కంచర్ల, ఆదిత్యమీనన్, ఆమని, తులసి, ముమైత్ ఖాన్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సికే సినిమాస్ పతాకంపై సి.కళ్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తుండగా, రాధన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. సి రామ్ ప్రసాద్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

మోషన్ పోస్టర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు టీజర్ తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

First Published:  29 Aug 2019 1:00 AM GMT
Next Story