Telugu Global
NEWS

సెంట్రల్ జైలుకు శేఖర్ చౌదరి.... నవీన్‌ అరెస్ట్

రైతు వేషం కట్టి ప్రభుత్వంపై అసత్యప్రచారం చేయడంతో పాటు… సీఎం జగన్, మంత్రి అనిల్‌ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శేఖర్‌ చౌదరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అతడితో పాటు సదరు వీడియో చిత్రీకరణకు సహకరించిన మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ అనుబంధంగా పనిచేస్తున్న పెయిడ్‌ వర్కర్స్‌ సత్యేంద్ర, శివప్రసాద్‌, సీతారామయ్య, శివయ్యలుగా వీరిని గుర్తించారు. వీరిపై ఐపీసీ 153, 153ఏ, 505(2) రెడ్‌విత్ 34, 120 బీ సెక్షన్‌ కింద […]

సెంట్రల్ జైలుకు శేఖర్ చౌదరి.... నవీన్‌ అరెస్ట్
X

రైతు వేషం కట్టి ప్రభుత్వంపై అసత్యప్రచారం చేయడంతో పాటు… సీఎం జగన్, మంత్రి అనిల్‌ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శేఖర్‌ చౌదరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అతడితో పాటు సదరు వీడియో చిత్రీకరణకు సహకరించిన మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

టీడీపీ అనుబంధంగా పనిచేస్తున్న పెయిడ్‌ వర్కర్స్‌ సత్యేంద్ర, శివప్రసాద్‌, సీతారామయ్య, శివయ్యలుగా వీరిని గుర్తించారు. వీరిపై ఐపీసీ 153, 153ఏ, 505(2) రెడ్‌విత్ 34, 120 బీ సెక్షన్‌ కింద కేసులు నమోలు చేశారు. వీరిలో కోర్టులో హాజరుపరచగా… సెప్టెంబర్‌ 7వరకు రిమాండ్ విధించారు. దాంతో వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

విచారణలో వీరంతా నేరం అంగీకరించారు. టీడీపీ ఇచ్చే డబ్బులు తీసుకునే తాము ఈ ప్రచారం చేసినట్టు అంగీకరించారు. మరికొన్ని టీంలు కూడా ఇదే పని మీద ఉన్నాయని వారు పోలీసుల దృష్టికి తెచ్చారు.

అటు తిరుమలలో చర్చి కట్టారన్న ప్రచారంతో పాటు…. నిత్యం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిపై అత్యంత జుగుప్సాకరమైన పోస్టులు పెడుతున్న నవీన్‌ గౌడ్‌ అనే టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడిది మహబూబ్‌నగర్ జిల్లా. మెదక్ జిల్లాలో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు.

ఖాళీ సమయాల్లో ఇలా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, సమాజంలో కుల, మత పరమైన విద్వేషాలు పెంచేలా పోస్టులు పెట్టడం వంటివి చేస్తుంటాడు.

ఈ నేపథ్యంలో ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్‌ గురించి తెలుసున్న నవీన్‌ గౌడ్… తనకు అండగా చంద్రబాబు, లోకేష్‌ ఉండాలంటూ పోస్టు పెట్టాడు.

First Published:  29 Aug 2019 2:46 AM GMT
Next Story