టీడీపీని, ఎల్లో మీడియాని కడిగిపారేసిన విజయసాయి రెడ్డి

తొమ్మిదేళ్లలో హైదరాబాద్‌ను నిర్మించానని చెబుతున్న చంద్రబాబు… మరి ఐదేళ్ళలో అమరావతిలో నాలుగు తాత్కాలిక భవనాలు మినహా ఏం కట్టలేకపోయారని…. ఎందుకు కట్టలేకపోయారో చెప్పాలని ప్రశ్నించారు.

హైదరాబాద్‌ అయినా అమరావతి అయినా చంద్రబాబు చేసింది కేవలం బినామీలతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారమేనన్నారు. దానినే అభివృద్ధి అంటూ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సుజనా చౌదరి అమరావతి పై చేస్తున్న కామెంట్స్‌ పై…. ట్విట్టర్‌ లో స్పందించారు విజయసాయిరెడ్డి.

రాజధాని అమరావతిలో సుజనా చౌదరికి సెంటు భూమి కూడా లేదని చెబుతున్నాడని…. ఫ్రాడ్స్‌ చేయడంలో ఆరితేరిపోయిన సుజనా… చంద్రబాబుకు హృదయ కాలేయంగా మారాడని ఎద్దేవా చేశారు.

గతంలో కూడా ఇలాగే బ్యాంకులకు 6 వేల కోట్లు ఎగ్గొట్టిన సుజనా…. ఈడీకి అడ్డంగా దొరికిన తర్వాత కూడా దబాయించాడని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి.

చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన దోపిడీని… బయటపడకుండా కాపాడిన ఎల్లో మీడియా…. అధికారంపోయాక కూడా ఇప్పటికీ చంద్రబాబుకు బానిసత్వం కొనసాగిస్తూనే ఉందన్నారు. అసెంబ్లీ ఫర్నీచర్‌, ఏసీలు, కంప్యూటర్లను ఎత్తుకెళ్ళిన అసెంబ్లీ దొంగ కోడెలను, ఆయన దూడల మీద ఈగ వాలకుండా పచ్చమీడియా జాగ్రత్తగా చూసుకుంటోందన్నారు.

మీరెంత దాచినా దాగేది కాదని… ఇది సోషల్‌ మీడియా యుగమని… మూడోకన్ను తెరుచుకుందన్నారు విజయసాయిరెడ్డి.

మీరెంత మూసుకున్నా మూడోకన్ను రెప్ప వాల్చదు అంటూ…. టీడీపీని, ఎల్లో మీడియాను కడిగిపారేశారు విజయసాయిరెడ్డి.