Telugu Global
NEWS

ఆ 927 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయండి

గిరిజనుల కష్టాలు తీరనున్నాయి. తమ వారి ప్రాణాలు కాపాడుకునేందుకు కొండలు దిగి.. కోనలు దాటి.. డోలీల్లో మోసుకుంటూ దగ్గర ఉన్న పట్టణాలకు పరిగెత్తుకు వచ్చినా.. గిరిజనుల ప్రాణాలు మాత్రం గాల్లో దీపాల్లా ఉండేవి. ఇక ముందు ఆ పరిస్థితులు ఉండవు. గిరిజనుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి… రాష్ట్రంలోని ఏడు ఐటీడీఏ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పాలకొండ, పార్వతీపురం, సాలూరు, అరకు, […]

ఆ 927 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయండి
X

గిరిజనుల కష్టాలు తీరనున్నాయి. తమ వారి ప్రాణాలు కాపాడుకునేందుకు కొండలు దిగి.. కోనలు దాటి.. డోలీల్లో మోసుకుంటూ దగ్గర ఉన్న పట్టణాలకు పరిగెత్తుకు వచ్చినా.. గిరిజనుల ప్రాణాలు మాత్రం గాల్లో దీపాల్లా ఉండేవి. ఇక ముందు ఆ పరిస్థితులు ఉండవు.

గిరిజనుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి… రాష్ట్రంలోని ఏడు ఐటీడీఏ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పాలకొండ, పార్వతీపురం, సాలూరు, అరకు, రంపచోడవరం, కే.ఎల్.పురం, డోర్నాల ఐటీడీఏ ప్రాంతాలలో ఈ ఆసుపత్రులను నెలకొల్పాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ ఆసుపత్రుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే పూర్తి చేసి తన కార్యాలయానికి పంపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గురువారం నాడు ముఖ్యమంత్రి తాడేపల్లి లోని తన కార్యాలయంలో గిరిజన, సాంఘిక సంక్షేమం, మైనారిటీ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐటిడిఏ ల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

విజయనగరం జిల్లా సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, ఇదే జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ, విశాఖపట్నం జిల్లా పాడేరులో గిరిజన మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలో డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కొత్తగా హాస్టళ్లను తెరిచేందుకు కూడా సన్నాహాలు చేయాలని, ఈ పని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం.

రాష్ట్రంలోని 309 వసతి గృహాలలో ఖాళీగా ఉన్న 927 వాచ్ మెన్, వంట పని వారి ఖాళీలను భర్తీ చేయాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి హాస్టల్ లో టాయిలెట్ సౌకర్యం పై చర్యలు తీసుకోవాలని, మూడు దశల్లో తొమ్మిది ముఖ్యమైన పనులను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

“మన పిల్లల పెంపకం, చదువు, సౌకర్యాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో హాస్టల్లో ఉండే విద్యార్థుల కోసం కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ వంటివి పాఠశాల ప్రారంభం రోజునే ఖచ్చితంగా ఇవ్వాలని, అలా చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు.

First Published:  30 Aug 2019 12:25 AM GMT
Next Story