అమలాపురంలో డాక్టర్ ఫ్యామిలీ ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విషాధ ఘటన జరిగింది. డాక్టర్ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంది. అమలాపురంలో ఆర్థోపెడిక్ వైద్యుడిగా మంచి పేరున్న పెనుమత్స రామకృష్ణరాజు … తన భార్య, పెద్ద కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. పాయిజన్ ఇంజెక్షన్‌ తీసుకోవడం ద్వారా ముగ్గూరు ప్రాణాలు తీసుకున్నారు.

ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్నారు. ఇంటిలోనే రామకృష్ణరాజు, అతడి భార్య లక్ష్మీదేవి, కుమారుడు కృష్ణ సందీప్‌ ప్రాణాలు తీసుకున్నారు. కృష్ణ సందీప్‌ కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇప్పుడిప్పుడే ప్రాక్టిస్ చేస్తున్నారు.

చిన్న కుమారుడు కూడా ఎంబీబీఎస్ చదువుతున్నాడు. తన తండ్రి, తల్లి, అన్న ముగ్గురూ ఇంట్లో విగతజీవులై పడి ఉండడం చూసి చిన్న కుమారుడు బోరున విలపించాడు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమా…లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.