Telugu Global
NEWS

మరికాసేపట్లో భారత్- విండీస్ రెండో టెస్ట్

జమైకా వేదికగా ఆఖరాట హాట్ ఫేవరెట్ గా భారత్ ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లో భాగంగా…కరీబియన్ గడ్డపై జరుగుతున్న రెండుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి టెస్టుకు టాప్ ర్యాంకర్ భారత్, 9వ ర్యాంకర్ వెస్టిండీస్ సై అంటే సై అంటున్నాయి. జమైకాలోని కింగ్స్ టన్ సబైనా పార్క్ వేదికగా ఐదురోజులపాటు జరిగే ఈ మ్యాచ్ లో సైతం భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఆంటీగా వేదికగా ముగిసిన తొలిటెస్టులో 318 పరుగుల భారీవిజయంతో 1-0 ఆధిక్యం […]

మరికాసేపట్లో భారత్- విండీస్ రెండో టెస్ట్
X
  • జమైకా వేదికగా ఆఖరాట
  • హాట్ ఫేవరెట్ గా భారత్

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లో భాగంగా…కరీబియన్ గడ్డపై జరుగుతున్న రెండుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి టెస్టుకు టాప్ ర్యాంకర్ భారత్, 9వ ర్యాంకర్ వెస్టిండీస్ సై అంటే సై అంటున్నాయి.

జమైకాలోని కింగ్స్ టన్ సబైనా పార్క్ వేదికగా ఐదురోజులపాటు జరిగే ఈ మ్యాచ్ లో సైతం భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఆంటీగా వేదికగా ముగిసిన తొలిటెస్టులో 318 పరుగుల భారీవిజయంతో 1-0 ఆధిక్యం సాధించిన భారత్ రెండోటెస్టులోసైతం విన్నింగ్ కాంబినేషన్ నే కొనసాగించే అవకాశం అంది.

సూపర్ ఫామ్ లో ఆ ముగ్గురు…

భారత వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, ఫాస్ట్ బౌలింగ్ జోడీ బుమ్రా, ఇశాంత్ శర్మ సూపర్ ఫామ్ లో ఉండటంతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

తొలిటెస్టులో 81, 102 పరుగుల స్కోర్లు సాధించడం ద్వారా రహనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిస్తే..ఇశాంత్ శర్మ 8 వికెట్లు, బుమ్రా 6 వికెట్లతో మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు.

కెప్టెన్ విరాట్ కొహ్లీ, మిడిలార్డర్ ఆటగాడు హనుమ విహారీ సైతం హాఫ్ సెంచరీలతో తమ ఫామ్ ను చాటుకొన్నారు. రెండు టెస్టులో సైతం నిలకడగా రాణించాలన్న పట్టుదలతో ఉన్నారు.

రహానే తిరుగులేని రికార్డు…

వెస్టిండీస్ ప్రత్యర్థిగా ఆడిన 7 టెస్టుల్లో భారత కెప్టెన్ అజింక్యా రహానేకు కళ్లు చెదిరే రికార్డే ఉంది. మొత్తం 7టెస్టుల్లో భాగంగా ఆడిన 8 ఇన్నింగ్స్ లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు సాధించిన ఘతన రహానేదే. 91.16 సగటుతో 547 పరుగులు సాధించాడు. ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ కొహ్లీకి సైతం లేని రికార్డును వైస్ కెప్టెన్ రహానే సొంతం చేసుకోడం విశేషం.

అయోమయంలో కరీబియన్ టీమ్…

తొలిటెస్టులో విండీస్ తరపున ఒక్క ఆటగాడు కనీసం హాఫ్ సెంచరీ స్కోరు సాధించలేకపోడం…టీమ్ మేనేజ్ మెంట్ ను ఆందోళనకు గురి చేసింది. కనీసం రెండోటెస్టులోనైనా స్థాయికి తగ్గట్టుగా బ్యాట్ చేయగలిగితే టాప్ ర్యాంక్ భారత్ కు గట్టి పోటీ ఇవ్వగలమని విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ గట్టిగా నమ్ముతున్నాడు.

సబైనాలో విండీస్ దే పైచేయి…

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వికెట్లలో ఒకటిగా పేరుపొందిన సబైనా పార్క్ వేదికగా ఆతిథ్య విండీస్ కే భారత్ పై మెరుగైన రికార్డు ఉంది. రెండుజట్ల మధ్య 12 టెస్టులు జరిగితే విండీస్6 విజయాలు, 2 పరాజయాలు, 4 డ్రాల రికార్డుతో ఉంది.

మరోవైపు… భారత్ కు మాత్రం 2 విజయాలు, 6 పరాజయాల రికార్డు ఉంది. 2006, 2011 సిరీస్ ల్లో భాగంగా సబైనా పార్క్ వేదికగా జరిగిన మ్యాచ్ ల్లో భారత్ విజేతగా నిలిచింది.

ఓవరాల్ గా విండీస్ ఆధిక్యం…

కరీబియన్ ద్వీపాలు వేదికగా ఆడిన టెస్టుల్లో ఆతిథ్య విండీస్ కు 30 విజయాలు, భారత్ కు 21 విజయాల రికార్డు ఉంది. కనీసం ఈ ఆఖరి టెస్టులోనైనా నెగ్గి పరువుదక్కించుకోవాలన్న పట్టుదలతో విండీస్ జట్టు పోరాటానికి సిద్ధమయ్యింది.

అయితే…మ్యాచ్ ఐదురోజులూ భారత్ కు విండీస్ ఎంతవరకూ పోటీ ఇవ్వగలదన్నది అనుమానమే. భారత కాలమానప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

First Published:  30 Aug 2019 4:20 AM GMT
Next Story