సౌతాఫ్రికాతో టీ-20 సిరీస్…. ధోనీకి దక్కని చోటు

  • సెప్టెంబర్ 15 నుంచి సఫారీలతో తీన్మార్ టీ-20 సిరీస్
  • జస్ ప్రీత్ బుమ్రాకు సైతం విశ్రాంతి

సౌతాఫ్రికాతో ఈ నెల 15 నుంచి జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి చోటు దక్కలేదు. యువవికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ నే కొనసాగించాలని ఎంపిక సంఘం నిర్ణయించింది.

ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాకు సైతం విశ్రాంతి ఇవ్వనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. విండీస్ తో ముగిసిన తీన్మార్ టీ-20సిరీస్ లో విజేతగా నిలిచిన జట్టు సభ్యులనే.. సౌతాఫ్రికాతో జరిగే సిరీస్ లో సైతం కొనసాగించాలని నిర్ణయించారు.

సిరీస్ లోని తొలి మ్యాచ్ ధర్మశాల వేదికగా సెప్టెంబర్ 15న ప్రారంభమవుతుంది. సిరీస్ లోని రెండు, మూడు టీ-20 మ్యాచ్ లు సెప్టెంబర్ 18, 22 తేదీలలో నిర్వహిస్తారు.

ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ తర్వాత…తనకుతానుగా ఎంపికకు దూరంగా ఉన్న ధోనీ…సైనికదళాల సేవ తర్వాత అందుబాటులోకి వచ్చినా… సెలెక్షన్ కమిటీ పక్కనపెట్టడం విశేషం.

వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ కోసం భారతజట్టును సిద్ధం చేయటంలో భాగంగా మొత్తం 22 సన్నాహక టీ-20 మ్యాచ్ లు ఆడనుంది.