Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్... నెక్స్ట్ ఇదే !

‘బాహుబలి’ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరొక ప్యాన్ ఇండియన్ మూవీ గా ‘సాహో’ సినిమా ఇవాళ అనగా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. సుజిత్ దర్శకత్వంలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ కి […]

prabhas hindi tamil language
X

‘బాహుబలి’ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరొక ప్యాన్ ఇండియన్ మూవీ గా ‘సాహో’ సినిమా ఇవాళ అనగా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది.

సుజిత్ దర్శకత్వంలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ కి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన తదుపరి సినిమా గురించి బయట పెట్టాడు ప్రభాస్.

మీ నెక్స్ట్ మూవీ లవ్ స్టోరీనా? అది ఎలా ఉండబోతుంది? అని అడిగితే ప్రభాస్ “1960ల నాటి యూరప్ నేపథ్యంలో నడిచే ఒక డిఫరెంట్ ప్రేమ కథ ఇది. ఇంతవరకు ఇలాంటి లవ్ స్టోరీ ఇండియన్ సినిమాలో రానంత కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది” అని క్లారిటీ ఇచ్చారు.

దీంతో ప్రభాస్ ఒక పీరియడ్ లవ్ స్టోరీ లో నటిస్తున్నారు అని తెలుస్తోంది. ఇది భారీ బడ్జెట్ మూవీ కాకపోయినా ప్యాన్ ఇండియన్ అప్పీల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రాధాకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు 20 రోజులకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.

First Published:  30 Aug 2019 12:57 AM GMT
Next Story