Telugu Global
NEWS

టెస్ట్ క్రికెట్లో ధోనీ కెప్టెన్సీ రికార్డుకు కొహ్లీ గురి

45 టెస్టుల్లో కెప్టెన్ గా ధోనీ 27 విజయాలు కొహ్లీ కెప్టెన్ గా 47 టెస్టుల్లో 27 విజయాలు టెస్ట్ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా ధోనీ పేరుతో ఉన్న రికార్డును అధిగమించడానికి విరాట్ కొహ్లీ తహతహలాడుతున్నాడు. కింగ్స్ టన్ వేదికగా విండీస్ తో ఈ రోజు ప్రారంభమయ్యే రెండోటెస్ట్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ లో సైతం భారత్ విజేతగా నిలిస్తే… కెప్టెన్ గా విరాట్ కొహ్లీ అత్యధిక […]

టెస్ట్ క్రికెట్లో ధోనీ కెప్టెన్సీ రికార్డుకు కొహ్లీ గురి
X
  • 45 టెస్టుల్లో కెప్టెన్ గా ధోనీ 27 విజయాలు
  • కొహ్లీ కెప్టెన్ గా 47 టెస్టుల్లో 27 విజయాలు

టెస్ట్ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా ధోనీ పేరుతో ఉన్న రికార్డును అధిగమించడానికి విరాట్ కొహ్లీ తహతహలాడుతున్నాడు.

కింగ్స్ టన్ వేదికగా విండీస్ తో ఈ రోజు ప్రారంభమయ్యే రెండోటెస్ట్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

ఈ మ్యాచ్ లో సైతం భారత్ విజేతగా నిలిస్తే… కెప్టెన్ గా విరాట్ కొహ్లీ అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్ గా నిలిచిపోగలుగుతాడు.

ధోనీ విజయశాతం 45

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా భారత్ 45 టెస్టులు ఆడి 27 విజయాలు, 18 పరాజయాలు, 17 డ్రాల రికార్డుతో నిలిచింది. కెప్టెన్ గా ధోనీ 45శాతం మాత్రమే విజయాలు సాధించాడు.

మరోవైపు …విరాట్ కొహ్లీ మాత్రం…ప్రస్తుతం విండీస్ తో జరుగుతున్న రెండుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్ట్ వరకూ మొత్తం 47 టెస్టుల్లో భారతజట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు.

27 విజయాలు, 10 పరాజయాలు, 10 డ్రాల రికార్డుతో 55.31 విజయశాతం సాధించాడు. 2014 ఆస్ట్ర్రేలియా టూర్ లో భాగంగా జరిగిన టెస్ట్ సిరీస్ లో…ధోనీ నుంచి భారతజట్టు పగ్గాలను కొహ్లీ చేపట్టాడు.

ఆసీస్ ను ఆసీస్ గడ్డపై చిత్తు చేయడం ద్వారా భారత్ కు తొలిసారిగా 3-1తో సిరీస్ విజయం అందించిన ఘనత కొహ్లీకి మాత్రమే దక్కుతుంది.

గంగూలీ రికార్డు తెరమరుగు..

విదేశీగడ్డపై భారత కెప్టెన్ గా అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ పేరుతో ఉన్న రికార్డును ..ప్రస్తుత సిరీస్ లోని తొలిటెస్టులో భారత్ సాధించిన 318 పరుగుల భారీవిజయంతోనే…విరాట్ కొహ్లీ అధిగమించగలిగాడు.

కెప్టెన్ గా విదేశీగడ్డపై గంగూలీ ఆడిన 28 టెస్టుల్లో 11 విజయాలు సాధించాడు. విరాట్ కొహ్లీ మాత్రం కేవలం 26 టెస్టుల్లోనే కెప్టెన్ గా 12 విజయాలతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

First Published:  30 Aug 2019 12:22 AM GMT
Next Story