Telugu Global
NEWS

నేడు ఏపీ వనమహోత్సవం.... పర్యావరణ పరిరక్షణే ధ్యేయం

ఆంధ్రప్రదేశ్ లో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనమే లక్ష్యంగా రాష్ట్ర్ర ప్రభుత్వం శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం గుంటూరు జిల్లా పేరేచర్ల మండలం డోకిపర్రు గ్రామంలో మొక్కను నాటి వనమహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన అటవీ శాఖ ప్రదర్శన శాలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు […]

నేడు ఏపీ వనమహోత్సవం.... పర్యావరణ పరిరక్షణే ధ్యేయం
X

ఆంధ్రప్రదేశ్ లో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనమే లక్ష్యంగా రాష్ట్ర్ర ప్రభుత్వం శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం గుంటూరు జిల్లా పేరేచర్ల మండలం డోకిపర్రు గ్రామంలో మొక్కను నాటి వనమహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

అటవీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన అటవీ శాఖ ప్రదర్శన శాలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటేందుకు ఐదు వేల మంది విద్యార్థులు, స్ధానికులు, ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది. పర్యావరణాన్ని కాపాడేందుకు ఇప్పటికే పలు కార్యక్రమాలను చేపడుతున్న ప్రభుత్వం నూతనంగా ఈ వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, నానాటికీ తీవ్రమవుతున్న మంచినీటి ఎద్దడి వంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మొక్కల పెంపకం తప్పనిసరి అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రతి గ్రామం, మండలం, ప్రతి జిల్లాలోను స్థానికులకే మొక్కల సంరక్షణ బాధ్యతను అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

అలాగే వీటి పరిరక్షణ బాధ్యతను కొత్తగా నియమితులైన గ్రామ, వార్డు సచివాలయాలకు ఎంపికైన కార్యదర్శులకు అప్పగిస్తారు. మొక్కలకు ప్రతిరోజూ నీళ్లు పోయడంతో పాటు వాటిని పశువుల బారి నుంచి రక్షించేందుకు కంచెలను కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

నిధులు లేవంటూ సాకులు చెప్పి తప్పించుకోవాలని చూడరాదని, మొక్కల పెంపకం, సంరక్షణకు ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు సూచించారు.

First Published:  30 Aug 2019 9:18 PM GMT
Next Story