సాహో మొదటి రోజు వసూళ్లు

ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన సాహో మొదటి రోజు మెరిసింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు.. అంచనాలు భారీగా పెరగడంతో సాహోకు మొదటి రోజు కలిసొచ్చింది. విడుదలైన తొలిరోజునే వరల్డ్ వైడ్ 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు 37 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. బాహుబలి-2 తర్వాత తెలుగులో హయ్యస్ట్ షేర్లు ఇవే.

ఈ క్రమంలో రెండు ఏరియాల్లో బాహుబలి-2ను కూడా క్రాస్ చేసింది సాహో. నైజాంలో ఈ సినిమాకు 9 కోట్ల 40 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అటు నెల్లూరులో 2 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ రెండు ఏరియాల్లో బాహుబలి-2ను క్రాస్ చేసి ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది సాహో. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 9.40 కోట్లు
సీడెడ్ – రూ. 4.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.77 కోట్లు
ఈస్ట్ – రూ. 4.42 కోట్లు
వెస్ట్ – రూ. 3.60 కోట్లు
గుంటూరు – రూ. 4.70 కోట్లు
నెల్లూరు – రూ. 2.20 కోట్లు
కృష్ణా – రూ. 2.51 కోట్లు