Telugu Global
Cinema & Entertainment

సాహో.. ఓవర్సీస్ రికార్డు జస్ట్ మిస్

మిలియన్ డాలర్ క్లబ్ అనేది టాలీవుడ్ సినిమాకు డ్రీమ్. అలాంటిది సింగిల్ డేలోనే 10లక్షల డాలర్ల వసూళ్లంటే మాటలు కాదు. అలాంటి అరుదైన ఘనతకు ఇప్పటికే కొందరు దక్కించుకున్నారు. కానీ సాహో సినిమా మాత్రం కొద్దిలో ఈ రికార్డును మిస్ అయింది. ఈరోజు రిలీజైన ఈ సినిమా మొదటి రోజు మిలియన్ మార్క్ క్రాస్ చేయలేకపోయింది. సాహో సినిమాకు ప్రీమియర్స్ తో కలుపుకొని ఓవర్సీస్ లో 9 లక్షల 15వేల డాలర్లు వచ్చాయి. అమెరికా, కెనడాలోని 317 […]

సాహో.. ఓవర్సీస్ రికార్డు జస్ట్ మిస్
X

మిలియన్ డాలర్ క్లబ్ అనేది టాలీవుడ్ సినిమాకు డ్రీమ్. అలాంటిది సింగిల్ డేలోనే 10లక్షల డాలర్ల వసూళ్లంటే మాటలు కాదు. అలాంటి అరుదైన ఘనతకు ఇప్పటికే కొందరు దక్కించుకున్నారు. కానీ సాహో సినిమా మాత్రం కొద్దిలో ఈ రికార్డును మిస్ అయింది. ఈరోజు రిలీజైన ఈ సినిమా మొదటి రోజు మిలియన్ మార్క్ క్రాస్ చేయలేకపోయింది.

సాహో సినిమాకు ప్రీమియర్స్ తో కలుపుకొని ఓవర్సీస్ లో 9 లక్షల 15వేల డాలర్లు వచ్చాయి. అమెరికా, కెనడాలోని 317 లొకేషన్స్ నుంచి వచ్చిన డేటా ఆధారంగా ఇంత మొత్తం కలెక్ట్ అయినట్టు ప్రకటించారు. మరో 32 లొకేషన్స్ నుంచి డేటా రావాల్సి ఉంది. ఆ వసూళ్లు కలుపుకున్నప్పటికీ ఇది 10 లక్షల డాలర్లు కలెక్ట్ చేయడం కష్టం. అలా మొదటి రోజు మిలియన్ డాలర్ క్లబ్ లోకి వెళ్లలేకపోయింది సాహో.

ఓవర్సీస్ లో మొదటి రోజు వసూళ్లలో బాహుబలి-2దే రికార్డు. ఆ తర్వాత అజ్ఞాతవాసి, బాహుబలి-1, ఖైదీ నంబర్-150 సినిమాలున్నాయి. ఇవన్నీ మొదటి రోజే మిలియన్ మార్క్ గ్రాస్ అందుకున్నాయి. కానీ సాహో మాత్రం ఈ మార్క్ అందుకోలేకపోయింది.

First Published:  31 Aug 2019 4:02 AM GMT
Next Story