Telugu Global
NEWS

పర్యావరణానికి పెద్దపీట.. 25 కోట్ల మొక్కలు నాటుతాం

తమ ప్రభుత్వం పర్యావరణానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో జరిగిన వనమహోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి… గ్రామ వాలంటీర్ల ద్వారా మొక్కల పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 23 శాతం అడవులు మాత్రమే ఉన్నాయని… వాటిని 33 శాతానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. స్కూల్‌ పిల్లలు మొక్కలు నాటే కార్యక్రమంలో ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు. మనం […]

పర్యావరణానికి పెద్దపీట.. 25 కోట్ల మొక్కలు నాటుతాం
X

తమ ప్రభుత్వం పర్యావరణానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో జరిగిన వనమహోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి… గ్రామ వాలంటీర్ల ద్వారా మొక్కల పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 23 శాతం అడవులు మాత్రమే ఉన్నాయని… వాటిని 33 శాతానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. స్కూల్‌ పిల్లలు మొక్కలు నాటే కార్యక్రమంలో ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు.

మనం పెంచే ప్రతి చెట్టు రాబోయే తరాలకు ఊపిరి పోస్తుందన్నారు. భూమి మీద ఆక్సిజన్‌ ఇచ్చే ఏకైక ప్రాణి చెట్టు మాత్రమేనన్నారు. రోడ్లకు ఇరువైపుల చెట్లు నాటించారు కాబట్టే అశోకుడు గొప్ప చక్రవర్తిగా చరిత్రలో ఇప్పటికీ చెప్పుకుంటున్నామన్నారు.

రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు రెండుమూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అప్పుడే రాష్ట్రంలో గ్రీన్ కవర్‌ను కాపాడుకున్న వారమవుతామన్నారు. రాష్ట్రంలో ఒక్కరోజే కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ సీజన్‌లో 25 కోట్ల మొక్కలు నాటుతామన్నారు.

అడవులు అంతరించి పోతే భూమి ఎడారిగా మారిపోతుందన్నారు. మనం నాటే ప్రతి మొక్క భూమాతకు మంచి చేస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందుకే ఆర్టీసీలో వెయ్యి విద్యుత్ బస్సులను తీసుకొస్తున్నామన్నారు.

First Published:  31 Aug 2019 4:38 AM GMT
Next Story