Telugu Global
NEWS

జమైకా టెస్ట్ పై భారత్ పట్టు

భారత్ 416, విండీస్ 7 వికెట్లకు 87 పరుగులు హనుమ విహారీ సెంచరీ, బుమ్రా హ్యాట్రిక్ ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా విండీస్ తో జరుగుతున్న రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ …రెండోటెస్ట్ రెండో రోజు ఆటలోనే టాప్ ర్యాంకర్ భారత్… భారీ విజయానికి పునాది వేసుకొంది. ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు ఆటకొనసాగించిన భారత్ 416 పరుగుల భారీ స్కోరుతో మ్యాచ్ పై పట్టు బిగించింది. విహారీ టెస్ట్ తొలిసెంచరీ… భారత మిడిలార్డర్ ఆటగాడు […]

జమైకా టెస్ట్ పై భారత్ పట్టు
X
  • భారత్ 416, విండీస్ 7 వికెట్లకు 87 పరుగులు
  • హనుమ విహారీ సెంచరీ, బుమ్రా హ్యాట్రిక్

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా విండీస్ తో జరుగుతున్న రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ …రెండోటెస్ట్ రెండో రోజు ఆటలోనే టాప్ ర్యాంకర్ భారత్… భారీ విజయానికి పునాది వేసుకొంది.

ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు ఆటకొనసాగించిన భారత్ 416 పరుగుల భారీ స్కోరుతో మ్యాచ్ పై పట్టు బిగించింది.

విహారీ టెస్ట్ తొలిసెంచరీ…

భారత మిడిలార్డర్ ఆటగాడు హనుమ విహారీ , లోయర్ ఆర్డర్ ఆటగాడు ఇషాంత్ శర్మ ఫైటింగ్ సెంచరీ, హాఫ్ సెంచరీలు సాధించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగుల భారీస్కోరు సాధించింది. తన కెరియర్ లో కేవలం 6వ టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడుతున్న ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారీ.. మొట్టమొదటి సెంచరీ నమోదు చేశాడు. 225 బంతులు ఎదుర్కొని
16 బౌండ్రీలతో 111 పరుగుల స్కోరుకు హోల్డర్ బౌలింగ్ లో రోచ్ పట్టిన క్యాచ్ కు అవుటయ్యాడు.

ఇశాంత్ తొలిహాఫ్ సెంచరీ….

భారత ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ.. 8వ వికెట్ కు హనుమ విహారీతో కలసి 102 పరుగుల కీలకభాగస్వామ్యం సాధించాడు. అంతేకాదు…తన కెరియర్ లో 92వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఇశాంత్ కు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇశాంత్ మొత్తం 80 బాల్స్ ఎదుర్కొని 7 బౌండ్రీలతో 57 పరుగుల స్కోరుకు బ్రాత్ వెయిట్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ 77 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు.

కరీబియన్ టాపార్డర్ టపటపా…

భారత భారీ స్కోరు 416 పరుగులకు సమాధానంగా…తన ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లలో 7 వికెట్లకు 87 పరుగులతో ఎదురీదుతోంది.

విండీస్ ఆటగాళ్లలో హెట్ మేయర్ 34, హోల్డర్ 18 పరుగులు సాధించారు. టెస్ట్ అరంగేట్రం ఆటగాళ్లు హామిల్టన్ 2, రకీం కార్న్ వాల్ 4 పరుగుల స్కోర్లతో క్రీజులో ఉన్నారు.

తొలి ఇన్నింగ్స్ లో భారత్ కంటే 329 పరుగుల స్కోరుతో వెనుకబడిన విండీస్ కు ఇన్నింగ్స్ ఓటమి తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

తొలిటెస్టులో 318 పరుగుల విజయంతో 60 పాయింట్లు సాధించిన భారత్…సిరీస్ విజయంతో భారీగా పాయింట్లు సాధించే అవకాశం ఉంది.

First Published:  1 Sep 2019 6:13 AM GMT
Next Story