Telugu Global
NEWS

యూఎస్ ఓపెన్ లో అరుదైన ఘట్టం

ఓటమితో వెక్కివెక్కి ఏడ్చిన టీనేజర్ కోకో కోకో గాఫ్ ను ఓదార్చిన నవోమీ ఒసాకా జయాపజయాలకు అతీతంగా, భావోద్వేగాల సమహారంగా సాగిపోయే యూఎస్ ఓపెన్ టెన్నిస్ లో ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకొంది. న్యూయార్క్ లోని ఆర్థర్ యాష్ స్టేడియం వేదికగా జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్లో భాగంగా ప్రపంచ నంబర్ వన్ నవోమీ ఒసాకా- అమెరికన్ టీనేజర్ కోకో గాఫ్ ల నడుమ జరిగిన ఈ మ్యాచ్ అందరినీ ఆకట్టుకొంది. ఏకపక్షంగా సాగిన పోరులో టాప్ ర్యాంక్ […]

యూఎస్ ఓపెన్ లో అరుదైన ఘట్టం
X
  • ఓటమితో వెక్కివెక్కి ఏడ్చిన టీనేజర్ కోకో
  • కోకో గాఫ్ ను ఓదార్చిన నవోమీ ఒసాకా

జయాపజయాలకు అతీతంగా, భావోద్వేగాల సమహారంగా సాగిపోయే యూఎస్ ఓపెన్ టెన్నిస్ లో ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకొంది.

న్యూయార్క్ లోని ఆర్థర్ యాష్ స్టేడియం వేదికగా జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్లో భాగంగా ప్రపంచ నంబర్ వన్ నవోమీ ఒసాకా- అమెరికన్ టీనేజర్ కోకో గాఫ్ ల నడుమ జరిగిన ఈ మ్యాచ్ అందరినీ ఆకట్టుకొంది.

ఏకపక్షంగా సాగిన పోరులో టాప్ ర్యాంక్ నవోమీ ఒసాకా 6-3, 6-0తో 15 ఏళ్ల కోకో గాఫ్ ను చిత్తు చేసింది. తన టెన్నిస్ కెరియర్ లో తొలిసారిగా అమెరికన్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించడం తో పాటు.. తొలి ప్రయత్నంలోనే ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ చేరిన టీనేజేర్ కోకో గాఫ్.. ఘోర పరాజయాన్ని తట్టుకోలేకపోయింది.

తాను ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోడాన్ని జీర్ణించుకోలేకపోయింది.

ఓడిన వెంటనే వలవలా ఏడ్చింది. కన్నీరుమున్నీరైన కోకోను విజేత ఒసాకా ఓదార్చింది. తాను సైతం కంటనీరు పెట్టుకొని.. కోకోకు అండగా నిలిచింది.

మ్యాచ్ ముగిసినా ఇద్దరూ కోర్టులోనే ఉండిపోడంతో…స్టాండ్స్ లోని అభిమానులు చూస్తూ ఉండిపోయారు. పదిహేను సంవత్సరాల కోకోను… 26 ఏళ్ల ఒసాకా ఓదార్చడం చూసి అభిమానులు మురిసిపోయారు. టెన్నిస్ కు అతీతంగా సాగిన ఈ మానవీయ ఘట్టం అభిమానుల హృదయాలను తట్టిలేపింది.

First Published:  1 Sep 2019 6:24 AM GMT
Next Story