Telugu Global
Cinema & Entertainment

సాహోపై స్పందించని రాజమౌళి.... కారణం అదేనా?

దర్శకుడు రాజమౌళి.. వర్ధమాన దర్శకులు, హీరోలు చేసే మంచి చిత్రాలను ప్రశంసించడంలో ఎప్పుడూ ముందుంటాడు. అర్జున్ రెడ్డితో మెస్మరైజ్ చేసిన విజయ్ దేవరకొండ నటనను ట్విట్టర్ లో రాజమౌళి ప్రశంసించారు. ఇక తెలుగులో వచ్చిన మంచి చిత్రాలను రాజమౌళి ట్విట్టర్ లో ప్రశంసిస్తుంటారు. కన్నడ హీరో సుదీప్ తాజా చిత్రం ‘పెహల్వీన్’ టీజర్ ను రాజమౌళి షేర్ చేసి కొనియాడారు. అయితే బాహుబలితో నెషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సాధించిన ప్రభాస్… సాహో ప్రీరిలీజ్ ఫంక్షన్ కు […]

సాహోపై స్పందించని రాజమౌళి.... కారణం అదేనా?
X

దర్శకుడు రాజమౌళి.. వర్ధమాన దర్శకులు, హీరోలు చేసే మంచి చిత్రాలను ప్రశంసించడంలో ఎప్పుడూ ముందుంటాడు. అర్జున్ రెడ్డితో మెస్మరైజ్ చేసిన విజయ్ దేవరకొండ నటనను ట్విట్టర్ లో రాజమౌళి ప్రశంసించారు.

ఇక తెలుగులో వచ్చిన మంచి చిత్రాలను రాజమౌళి ట్విట్టర్ లో ప్రశంసిస్తుంటారు. కన్నడ హీరో సుదీప్ తాజా చిత్రం ‘పెహల్వీన్’ టీజర్ ను రాజమౌళి షేర్ చేసి కొనియాడారు.

అయితే బాహుబలితో నెషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సాధించిన ప్రభాస్… సాహో ప్రీరిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి…. ఆ సినిమా విడుదలై మూడు రోజులు అవుతున్నా ట్విట్టర్ లో స్పందించకపోవడం షాకింగ్ లా మారింది.

అయితే సినిమాకు వచ్చిన నెగెటివ్ ఫీడ్ బ్యాక్, ఫ్లాప్ అన్న రివ్యూలు, మరోవైపు సహజంగా బెస్ట్ క్రియేటర్ అని పేరున్న రాజమౌళి సినిమా ఫలితాన్ని చూసే….. ఇలా ట్వీట్ చేయకపోయి ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బాహుబలితో వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ను మించి ప్రభాస్ ‘సాహో’ సినిమా ఉంటుందని అని అందరూ అనుకున్నారు…. కానీ ఆ ఆశలు అడియాశలు అయ్యాయి. రాజమౌళి స్పందించకపోవడం వెనుక కారణం ఇదేనని అందరూ అంటున్నారు.

First Published:  1 Sep 2019 5:27 AM GMT
Next Story