Telugu Global
Cinema & Entertainment

డిస్కో రాజా ఫస్ట్ లుక్

‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా తో డిజాస్టర్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ తాజాగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ విఐ ఆనంద్ తో కలిసి ‘డిస్కోరాజా’ అనే ఒక ఆసక్తి కరమైన ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సరికొత్త జోనర్ తో ప్రేక్షకులను అలరించబోతున్న ఈ సినిమాలో నభా నటేష్ మరియు పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, తాన్యా హోప్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా […]

డిస్కో రాజా ఫస్ట్ లుక్
X

‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా తో డిజాస్టర్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ తాజాగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ విఐ ఆనంద్ తో కలిసి ‘డిస్కోరాజా’ అనే ఒక ఆసక్తి కరమైన ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సరికొత్త జోనర్ తో ప్రేక్షకులను అలరించబోతున్న ఈ సినిమాలో నభా నటేష్ మరియు పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, తాన్యా హోప్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

రవితేజ కొత్త అవతారం లో కనిపిస్తున్న ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర సరికొత్తగా ఉండబోతోందని, రవితేజ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనున్నాడు అని పోస్టర్ చూస్తే తెలుస్తోంది.

ఎస్ ఆర్ టి మూవీస్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. మరి ఈ సినిమాతోనైనా రవితేజ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.

First Published:  2 Sep 2019 12:17 AM GMT
Next Story