Telugu Global
Cinema & Entertainment

'గ్యాంగ్ లీడర్'.... సిద్ శ్రీరామ్ పాట

ఈ మధ్యనే ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న నాచురల్ స్టార్ నాని…. తాజాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో లక్ష్మీ మరియు శరణ్య పొంవణ్ణన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నిన్ను చూసే ఆనందంలో’ […]

గ్యాంగ్ లీడర్.... సిద్ శ్రీరామ్ పాట
X

ఈ మధ్యనే ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న నాచురల్ స్టార్ నాని…. తాజాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో లక్ష్మీ మరియు శరణ్య పొంవణ్ణన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది.

తాజాగా ఈ చిత్రం నుంచి ‘నిన్ను చూసే ఆనందంలో’ అనే పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు….. ఈ మెలోడియస్ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాకి అనిరుద్ అందించిన సంగీతం కచ్చితంగా ప్లస్ అవుతుందని కేవలం ఈ పాట వింటే తెలుస్తుంది. ప్రస్తుతం సిద్ శ్రీరామ్ పాడిన ఈ వీడియో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ యూట్యూబ్ లో బోలెడు వ్యూస్ సంపాదిస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13, 2019 న విడుదలకు సిద్ధమవుతోంది. ‘జెర్సీ’ సినిమాతో హిట్ అందుకున్న నాచురల్ స్టార్ ఈ సినిమాతో తన విన్నింగ్ స్ట్రీక్ కొనసాగిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

First Published:  2 Sep 2019 8:50 AM GMT
Next Story