Telugu Global
Cinema & Entertainment

ఆర్-ఆర్-ఆర్ లేటెస్ట్ అప్ డేట్

ఆర్-ఆర్-ఆర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ 2 అప్ డేట్స్ వచ్చాయి. ఫేక్ కాస్టింగ్ కాల్ పై క్లారిటీ ఇచ్చిన ఈ సినిమా యూనిట్, తాజాగా మూవీ షూటింగ్ అప్ డేట్స్ ను విడుదల చేసింది. ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతున్న షెడ్యూల్ లో తారక్ పై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాని ప్రకటించారు. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పాల్గొనడం లేదు. అతడు నెక్ట్స్ షెడ్యూల్ కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. రాజమౌళికి బల్గేరియా కొత్తకాదు. బాహుబలి సినిమా […]

ఆర్-ఆర్-ఆర్ లేటెస్ట్ అప్ డేట్
X
ఆర్-ఆర్-ఆర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ 2 అప్ డేట్స్ వచ్చాయి. ఫేక్ కాస్టింగ్ కాల్ పై క్లారిటీ ఇచ్చిన ఈ సినిమా యూనిట్, తాజాగా మూవీ షూటింగ్ అప్ డేట్స్ ను విడుదల చేసింది. ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతున్న షెడ్యూల్ లో తారక్ పై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాని ప్రకటించారు. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పాల్గొనడం లేదు. అతడు నెక్ట్స్ షెడ్యూల్ కోసం శిక్షణ తీసుకుంటున్నాడు.

రాజమౌళికి బల్గేరియా కొత్తకాదు. బాహుబలి సినిమా కోసం ఓ షెడ్యూల్ ను ఇక్కడే షూట్ చేశారు. తమన్నను శత్రువులు వెంబడించే సీన్, తమన్నా-ప్రభాస్ మధ్య వచ్చే మరికొన్ని సన్నివేశాల్ని బల్గేరియాలోనే షూట్ చేశారు. ఆ కథకు ఆ లొకేషన్లు సరిగ్గా సరిపోయాయి. ఇప్పుడు ఆర్-ఆర్-ఆర్ కూడా ఆ లొకేషన్లు సెట్ అవుతాయని రాజమౌళి భావిస్తున్నాడు.

సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్నారు. చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది.ఎన్టీఆర్ సరసన నటించనున్న విదేశీ భామ ఎవరనే అంశాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు కీరవాణి ఇప్పటికే 3 పాటలిచ్చాడు.

First Published:  2 Sep 2019 6:34 AM GMT
Next Story