Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ ఓవర్సీస్ రికార్డ్

ఓవర్సీస్ లో తిరుగులేని రికార్డు సృష్టించాడు ప్రభాస్. ఇతడు నటించిన సాహో సినిమా విడుదలైన 3 రోజులకే 2 మిలియన్ మార్క్ అందుకుంది. తన సినిమాలతో ఇలా వరుసగా మూడోసారి 2 మిలియన్ క్లబ్ లోకి చేరిన మొట్టమొదటి హీరోగా నిలిచాడు ప్రభాస్. ఇప్పటివరకు ఏ తెలుగు హీరో ఇలా వరుసపెట్టి 3 సార్లు 2 మిలియన్ క్లబ్ లోకి వెళ్లలేకపోయాడు. ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి-2 సినిమాలు 2 మిలియన్ క్లబ్ లో ఉన్నాయి. ఇప్పుడీ […]

ప్రభాస్ ఓవర్సీస్ రికార్డ్
X

ఓవర్సీస్ లో తిరుగులేని రికార్డు సృష్టించాడు ప్రభాస్. ఇతడు నటించిన సాహో సినిమా విడుదలైన 3 రోజులకే 2 మిలియన్ మార్క్ అందుకుంది. తన సినిమాలతో ఇలా వరుసగా మూడోసారి 2 మిలియన్ క్లబ్ లోకి చేరిన మొట్టమొదటి హీరోగా నిలిచాడు ప్రభాస్. ఇప్పటివరకు ఏ తెలుగు హీరో ఇలా వరుసపెట్టి 3 సార్లు 2 మిలియన్ క్లబ్ లోకి వెళ్లలేకపోయాడు. ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి-2 సినిమాలు 2 మిలియన్ క్లబ్ లో ఉన్నాయి. ఇప్పుడీ క్లబ్ లోకి ప్రభాస్ నటించిన సాహో కూడా చేరింది.

ఆదివారం నాటి వసూళ్లతో ఈ సినిమాకు 20 లక్షల 80వేల 694 డాలర్ల మొత్తం వచ్చింది. సోమవారం నాటి వసూళ్లు కూడా భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అటు వరల్డ్ వైడ్ వసూళ్ల పరంగా ఈ సినిమా 3 రోజుల్లో 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఉత్తరాదిలో కూడా సాహో ప్రభంజనం కొనసాగుతోంది. 3 రోజుల్లో ఈ సినిమాకు 79 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. తాజా వసూళ్లతో ఇది కబీర్ సింగ్, భారత్, మిషన్ మంగళ్ సినిమాల్ని అధిగమించింది. ఇటు నైజాంలో కూడా సాహో డ్రీమ్ రన్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో బాహుబలి-2 రికార్డును బీట్ చేసింది సాహో.

First Published:  2 Sep 2019 6:35 AM GMT
Next Story