Telugu Global
NEWS

యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ లో ఫెదరర్, సెరెనా

ప్రీ-క్వార్టర్స్ లో అలవోకగా నెగ్గిన ఫెదరర్ అమెరికన్ ఓపెన్ పురుషుల, మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు మాజీ చాంపియన్లు రోజర్ ఫెదరర్, సెరెనా విలియమ్స్ అలవోకగా చేరుకొన్నారు. న్యూయార్క్ లోని ఆర్థర్ ఏష్ స్టేడియంలో జరిగిన ప్రీ-క్వార్టర్స్ లో ఇటు ఫెదరర్, అటు సెరెనాలకు పోటీనే లేకుండా పోయింది. ఫెదరర్ టాప్ గేర్… బెల్జియం ఆటగాడు డేవిడ్ గోఫిన్ తో జరిగిన ఐదోరౌండ్ పోటీలో మూడోసీడ్ ఫెదరర్ కేవలం 80 నిముషాలలోనే విజేతగా నిలిచాడు. 38 […]

యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ లో ఫెదరర్, సెరెనా
X
  • ప్రీ-క్వార్టర్స్ లో అలవోకగా నెగ్గిన ఫెదరర్

అమెరికన్ ఓపెన్ పురుషుల, మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు మాజీ చాంపియన్లు రోజర్ ఫెదరర్, సెరెనా విలియమ్స్ అలవోకగా చేరుకొన్నారు.

న్యూయార్క్ లోని ఆర్థర్ ఏష్ స్టేడియంలో జరిగిన ప్రీ-క్వార్టర్స్ లో ఇటు ఫెదరర్, అటు సెరెనాలకు పోటీనే లేకుండా పోయింది.

ఫెదరర్ టాప్ గేర్…

బెల్జియం ఆటగాడు డేవిడ్ గోఫిన్ తో జరిగిన ఐదోరౌండ్ పోటీలో మూడోసీడ్ ఫెదరర్ కేవలం 80 నిముషాలలోనే విజేతగా నిలిచాడు. 38 ఏళ్ల వయసులో సైతం.. కుర్రాడిలా ఆడిన ఫెదరర్ 35 విన్నర్లు, 10 ఏస్ లతో ప్రత్యర్థిని చిత్తు చేశాడు.

తన కెరియర్ లో 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు గురిపెట్టిన ఫెదరర్ 6-2, 6-2, 6-0తో విజేతగా నిలిచి…సెమీస్ లో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు.

సెరెనా వరుస సెట్ల విజయం…

మహిళల సింగిల్స్ లో 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు ఉరకలేస్తున్న ప్రపంచ మాజీ నెంబర్ వన్, అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ ప్రీ-క్వార్టర్స్ లో వరుస సెట్ల విజయం తో క్వార్టర్స్ లో అడుగుపెట్టింది.

క్రొయేషియా ప్లేయర్ పెట్రా మార్టిచ్ తో ముగిసిన పోటీలో 37 ఏళ్ల సెరెనా 6-3, 6-4తో సెరెనా విజయం సాధించింది. సెరెనా మొత్తం 38 విన్నర్లతో ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.

First Published:  2 Sep 2019 1:26 AM GMT
Next Story