వైఎస్ 10వ వర్ధంతి…. మహానేతకు నివాళి

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 10వ వర్ధంతి నేడు. పదేళ్ల క్రితం జరిగిన హెలీకాఫ్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. జగన్ సహా ఆయన కుటుంబ సభ్యలు ఇవాళ ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్‌కు వెళ్లారు.

వైసీపీ గౌరవ అధ్యక్షురాలు, వైఎస్ సతీమణి విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు కూడా అక్కడకు వెళ్లి పుష్పగుచ్చాలు పెట్టి నివాళ్లులు అర్పించారు.

ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ కడపజిల్లాలో జరిగే పలు వైఎస్ వర్దంతి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పులివెందుల అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించి సాయంత్రం విజయవాడ చేరుకొని అక్కడ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.