Telugu Global
Cinema & Entertainment

టాలీవుడ్ లో ఆ చీప్ స్టార్ ఎవరు?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆర్ఎక్స్100 సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి పెట్టిన ట్వీట్ అది. ఆయన ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. కేవలం చీప్ స్టార్ అంటూ ఓ పదం మాత్రం ట్వీట్ చేశారు. దీంతో ఈ పదం చుట్టూ సంచలనాలు మొదలయ్యాయి. ఇంతకీ అజయ్ భూపతి చీప్ స్టార్ అని అన్నది ఎవ్వరిని అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆర్ఎక్స్100 తర్వాత మహాసముద్రం అనే కథ రాసుకున్నాడు అజయ్ భూపతి. […]

టాలీవుడ్ లో ఆ చీప్ స్టార్ ఎవరు?
X

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆర్ఎక్స్100 సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి పెట్టిన ట్వీట్ అది. ఆయన ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. కేవలం చీప్ స్టార్ అంటూ ఓ పదం మాత్రం ట్వీట్ చేశారు. దీంతో ఈ పదం చుట్టూ సంచలనాలు మొదలయ్యాయి. ఇంతకీ అజయ్ భూపతి చీప్ స్టార్ అని అన్నది ఎవ్వరిని అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఆర్ఎక్స్100 తర్వాత మహాసముద్రం అనే కథ రాసుకున్నాడు అజయ్ భూపతి. ముందుగా ఈ స్టోరీని నాగచైతన్యతో చేద్దామని ప్లాన్ చేసినప్పటికీ వర్కవుట్ కాలేదు. తర్వాత రవితేజ దగ్గరకు వెళ్లాడు. రవితేజ ఓకే చేశాడు కూడా. కాకపోతే రీసెంట్ గా జరిగిన పరిణామాల కారణంగా ఈ ప్రాజెక్టును రవితేజ పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. ఈ కోపంతోనే అజయ్ భూపతి, అతడ్ని చీప్ స్టార్ అంటూ వ్యవహరించి ఉండొచ్చని ఓ గాసిప్ నడుస్తోంది.

ఇప్పుడీ వివాదం చినికిచినికి గాలివానగా మారడంతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రంగప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. అటు అజయ్ భూపతి, ఇటు రవితేజ ఇద్దరికీ రామ్ గోపాల్ వర్మ కామన్ ఫ్రెండ్. పైగా వీళ్లిద్దరికీ గురువు. సో.. వర్మ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడనేది వేచి చూడాలి. అప్పటివరకు ఈ చీప్ స్టార్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది.

First Published:  3 Sep 2019 4:07 AM GMT
Next Story