Telugu Global
NEWS

ఆ ల***కొడుకుల బొక్కలు ఇరగ్గొట్టిస్తా.... తప్పుడు ప్రచారంపై ఫిష్ వెంకట్

ఏపీలో ఫేక్ ప్రచారం పతాకస్థాయికి చేరుతోంది. వైసీపీ ప్రత్యర్థులు పనిగట్టుకుని నకిలీ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసిన టీడీపీ సాక్ష్యాలతో సహా దొరికిపోయి పరువు తీసుకుంది. పెయిడ్ ఆర్టిస్టులు జైలుకు కూడా వెళ్లారు. తాజాగా నటుడు ఫిష్ వెంకట్ పేరుతో కొందరు తప్పుడు ప్రచారానికి తెగబడ్డారు. వైసీపీ సానుభూతిపరుడుగా ఉన్న ఫిష్ వెంకట్ పేరుతో తప్పుడు ట్విట్టర్ అకౌంట్‌ను సృష్టించి… ఆ అకౌంట్‌ ద్వారా వైఎస్‌ఆర్‌పై అనుచితంగా వ్యాఖ్యలు […]

ఆ ల***కొడుకుల బొక్కలు ఇరగ్గొట్టిస్తా.... తప్పుడు ప్రచారంపై ఫిష్ వెంకట్
X

ఏపీలో ఫేక్ ప్రచారం పతాకస్థాయికి చేరుతోంది. వైసీపీ ప్రత్యర్థులు పనిగట్టుకుని నకిలీ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసిన టీడీపీ సాక్ష్యాలతో సహా దొరికిపోయి పరువు తీసుకుంది. పెయిడ్ ఆర్టిస్టులు జైలుకు కూడా వెళ్లారు. తాజాగా నటుడు ఫిష్ వెంకట్ పేరుతో కొందరు తప్పుడు ప్రచారానికి తెగబడ్డారు. వైసీపీ సానుభూతిపరుడుగా ఉన్న ఫిష్ వెంకట్ పేరుతో తప్పుడు ట్విట్టర్ అకౌంట్‌ను సృష్టించి… ఆ అకౌంట్‌ ద్వారా వైఎస్‌ఆర్‌పై అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. ఆ అకౌంట్‌ ఫిష్ వెంకట్‌దే అనుకుని కొందరు ఆయనపై విమర్శలకు దిగారు.

ఈ నేపథ్యంలో ఫిష్ వెంకట్ స్పందించారు. తన పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్‌ను సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని దాన్ని నమ్మవద్దని కోరారు. తనకు కనీసం ట్విట్టర్ అకౌంట్‌ కూడా లేదని… ట్విట్టర్‌ అకౌంట్‌ను ఉపయోగించడం కూడా తనకు తెలియదన్నారు. తాను వైఎస్ కుటుంబానికి వీరాభిమానినని చెప్పారు. పలువురు హేళన చేసినా సరే తాను తొలి నుంచి వైసీపీతోనే ఉన్నానని చెప్పారు.

బతికున్నంత కాలం తాను వైఎస్‌ కుటుంబానికి వీరాభిమానిగానే ఉంటానన్నారు. తమ కుటుంబం మొత్తం జగన్ సీఎం కావాలని ఎదురుచూశామన్నారు. జగన్‌ మామ ప్రతాప్‌ రెడ్డికి తాను ప్రియ మిత్రుడినని చెప్పారు. కావాలనే కొందరు తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వారిపై సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు. తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్న ల***కొడుకులకు బొక్కలు ఇరగ్గొట్టిస్తానని ఫిష్ వెంకట్ హెచ్చరించారు.

ఈ పవన్ కళ్యాణ్ ఫాన్స్ తీవ్రవాదులు కంటే ప్రమాదం

Posted by Sarat Kumar Dasari on Monday, 2 September 2019

First Published:  3 Sep 2019 12:06 AM GMT
Next Story