Telugu Global
National

భారత సైన్యంలో సైనికులుగా స్త్రీలకు అవకాశం

ఏడాదికి వందమంది స్త్రీ సైనికుల నియామక ప్రక్రియ ఇప్పటికే నడుస్తూ ఉన్నదని… డిసెంబర్ నాటికి వారికి ట్రైనింగ్ ఇవ్వటం కూడా ప్రారంభమవుతుందని ఓ ప్రముఖ పత్రిక పేర్కొంటున్నది. 61 వారాల పాటు పురుష సైనికులకు శిక్షణ ఇచ్చినట్లే ఈ స్త్రీ సైనికులకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం మీద 1700 మంది స్త్రీలు భారత సైన్యంలో ఉండేటట్లు చర్యలు తీసుకోబోతున్నారన్నమాట. రక్షణ దళాల్లో ఇప్పటివరకు పురుషులకే అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఏవో కొన్ని ఆఫీసర్ పోస్టుల్లో […]

భారత సైన్యంలో సైనికులుగా స్త్రీలకు అవకాశం
X

ఏడాదికి వందమంది స్త్రీ సైనికుల నియామక ప్రక్రియ ఇప్పటికే నడుస్తూ ఉన్నదని… డిసెంబర్ నాటికి వారికి ట్రైనింగ్ ఇవ్వటం కూడా ప్రారంభమవుతుందని ఓ ప్రముఖ పత్రిక పేర్కొంటున్నది. 61 వారాల పాటు పురుష సైనికులకు శిక్షణ ఇచ్చినట్లే ఈ స్త్రీ సైనికులకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు.

మొత్తం మీద 1700 మంది స్త్రీలు భారత సైన్యంలో ఉండేటట్లు చర్యలు తీసుకోబోతున్నారన్నమాట. రక్షణ దళాల్లో ఇప్పటివరకు పురుషులకే అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఏవో కొన్ని ఆఫీసర్ పోస్టుల్లో తప్ప స్త్రీల నియామకం ఎక్కడా కనిపించదు. రక్షణ దళాల్లో స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఈ నియామక అంతరాన్ని తొలగించటానికి ఇప్పుడు ఉపక్రమించారు.

ఈ ఏడాది మార్చి నెలలో ప్రభుత్వం… సైనిక దళాల్లో ఇప్పటివరకు నియామకానికి నోచుకోని విభాగాలలో స్త్రీలను నియమిస్తామని ప్రకటించింది. అయితే ఆ నియామకానికి సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించడంలో కొంత జాప్యం జరగడంతో ఆలస్యంగా నియామక ప్రక్రియ ప్రారంభమైంది. గత సంవత్సరం ప్రధానమంత్రి పర్మినెంట్ కమిషన్ ఆఫీసర్ గా స్త్రీలను నియమిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మొట్ట మొదటి సారిగా భారతీయ సైన్యంలో సోల్జర్ ర్యాంక్ లో స్త్రీలు నియమితులు అవుతున్నారు. ఇప్పటివరకు మెడికల్, ఎడ్యుకేషనల్, లీగల్, సిగ్నల్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో మాత్రమే స్త్రీలు ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు.

ఎయిర్ ఫోర్స్ లో షలిజ ధమి మొదటిసారిగా ఫ్లైట్ కమాండర్ గా నియమితులయ్యారు. ఆమె హెలికాప్టర్లను నడుపుతారు. ఆమెను పర్మినెంట్ కమిషన్ ఆఫీసర్ గా నియమించారు.

నేవీలో సముద్రంలోకి వెళ్లే ఉద్యోగాల్లో కి తప్ప దాదాపు అన్ని విభాగాల్లో స్త్రీలకు ప్రవేశం ఉన్నది.

First Published:  3 Sep 2019 6:12 AM GMT
Next Story