Telugu Global
Cinema & Entertainment

ఈ విషయంలో మాత్రం ప్రభాస్ జాగ్రత్త పడాల్సిందే!

సాహో సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ ప్రభాస్ దాన్ని పట్టించుకోలేదు. మరోసారి లార్గో వించ్ ఆధారంగా సినిమా తీశారంటూ విమర్శలు వచ్చాయి. దాన్ని కూడా పట్టించుకోలేదు. కలెక్షన్లపై వస్తున్న కామెంట్స్ ను కూడా ప్రభాస్ పట్టించుకున్నట్టు లేదు. కానీ ఒక విషయాన్ని మాత్రం ప్రభాస్ కచ్చితంగా పట్టించుకోవాలి. అతడి లుక్స్, డైలాగ్ డెలివరీపై వినిపిస్తున్న కామెంట్స్, వస్తున్న విమర్శలను మాత్రం ప్రభాస్ తప్పనిసరిగా లెక్కలోకి తీసుకోవాలి. సాహో సినిమాలో ప్రభాస్ చాలా డల్ […]

prabhas hindi tamil language
X

సాహో సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ ప్రభాస్ దాన్ని పట్టించుకోలేదు. మరోసారి లార్గో వించ్ ఆధారంగా సినిమా తీశారంటూ విమర్శలు వచ్చాయి. దాన్ని కూడా పట్టించుకోలేదు. కలెక్షన్లపై వస్తున్న కామెంట్స్ ను కూడా ప్రభాస్ పట్టించుకున్నట్టు లేదు. కానీ ఒక విషయాన్ని మాత్రం ప్రభాస్ కచ్చితంగా పట్టించుకోవాలి. అతడి లుక్స్, డైలాగ్ డెలివరీపై వినిపిస్తున్న కామెంట్స్, వస్తున్న విమర్శలను మాత్రం ప్రభాస్ తప్పనిసరిగా లెక్కలోకి తీసుకోవాలి.

సాహో సినిమాలో ప్రభాస్ చాలా డల్ గా కనిపించాడనేది ప్రధానమైన విమర్శ. బాహుబలికి ముందు ప్రభాస్ లో కనిపించిన యాక్టివ్ నెస్ సాహోలో మిస్ అయిందని, మరీ ముఖ్యంగా సినిమా ఫస్టాఫ్ లో ప్రభాస్ చాలా బద్ధకంగా కనిపించాడంటున్నారు చాలామంది. అటు బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి కూడా ఇదే మాట వినిపించింది. ఫస్టాఫ్ లో ప్రభాస్ ఇంకాస్త కామిక్ గా, యాక్టివ్ గా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

ప్రభాస్ ఈ కామెంట్ ను తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది అతడి యాక్టింగ్ కు సంబంధించిన విషయం. దర్శకుడు చెప్పినట్టే నటించాడా లేక కావాలనే అలా డల్ గా కనిపించాడా అనే విషయాన్ని పక్కనపెడితే.. ప్రభాస్ చాలా బద్ధకంగా కనిపించాడనే సంకేతం మాత్రం ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది. దీనికి తోడు డైలాగ్ డెలివరీపై కూడా కొన్ని విమర్శలు వినిపించాయి. సినిమాలో ప్రభాస్ చెప్పిన కొన్ని డైలాగ్స్ స్పష్టంగా లేవని కామెంట్స్ వచ్చాయి.

తన అప్ కమింగ్ మూవీస్ కు సంబంధించి ప్రభాస్ కచ్చితంగా ఈ రెండు అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. రెండేళ్ల పాటు సినిమాను తీయడం వల్ల సాహోలో ఒకే విధమైన లుక్ మెయింటైన్ చేయలేకపోయాడు ప్రభాస్. అది తప్పుకాదు. కానీ ఎనర్జీ లెవెల్స్ మాత్రం ఒకేలా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. ఈ విషయంలో ప్రభాస్ ఎంత కేర్ ఫుల్ గా ఉంటే అంత మంచిది.

First Published:  3 Sep 2019 2:47 AM GMT
Next Story