Telugu Global
NEWS

సదావర్తి భూములపై విచారణకు ఆదేశం

టీడీపీ హయాంలో సంచలనం సృష్టించిన సదావర్తి భూ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సదావర్తి భూముల వ్యవహారంలో అక్రమాలు నిజమేనని తేల్చింది. దీంతో అసెంబ్లీలో ప్రకటించినట్టుగానే ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. చెన్నై లో ఉన్న 1000కోట్ల విలువైన సత్రం భూములను కాజేసేందుకు టీడీపీ హాయంలో పెద్ద కుట్ర జరిగింది. తక్కువ ధరకే గుట్టుగా వేలం […]

సదావర్తి భూములపై విచారణకు ఆదేశం
X

టీడీపీ హయాంలో సంచలనం సృష్టించిన సదావర్తి భూ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సదావర్తి భూముల వ్యవహారంలో అక్రమాలు నిజమేనని తేల్చింది. దీంతో అసెంబ్లీలో ప్రకటించినట్టుగానే ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

చెన్నై లో ఉన్న 1000కోట్ల విలువైన సత్రం భూములను కాజేసేందుకు టీడీపీ హాయంలో పెద్ద కుట్ర జరిగింది. తక్కువ ధరకే గుట్టుగా వేలం నిర్వహించి టీడీపీ పెద్దల బినామీలు భూములు సొంతం చేసుకున్నారు.

దేవాదాయ శాఖ మంత్రిగా బీజేపీ నేత మాణిక్యాల రావు ఉన్న సమయంలోనే ఈ స్కాం జరిగింది. ఆయన కూడా టీడీపీ పెద్దలకు వంత పాడుతూ వచ్చారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా వైసీపీ తీవ్ర స్థాయిలో పోరాటం చేసింది.

First Published:  3 Sep 2019 8:51 AM GMT
Next Story